తేది: 27-01-2023
తాడేపల్లి*
*మార్చి 1న రాష్ట్రంలో మూడు ప్రధాన కార్యక్రమాల అమలు*
*మార్చి నుంచి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్*
*ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన చేయాలి: సీఎం జగన్*
మార్చి 1 నుంచి రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్ పంపిణీ ప్రారంభించాలని అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్షించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు సీఎంకు అధికారులు వెల్లడించారు. ప్రతి విలేజ్ క్లినిక్ కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ వెళ్తారని సీఎంకు అధికారులు వివరించారు. జనాభా 4వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రజాప్రతినిధుల ఆస్పత్రుల సందర్శన, గోరుముద్ద వంటి కీలకమైన మూడు కార్యక్రమాలు మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు అమలులోకి రానున్నాయని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆర్యోశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్‌రెడ్డి, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వి వినోద్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్(డ్రగ్స్) రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హెచ్ ప్రసాద్, ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments are closed.