20-01-2023*
*తాడేపల్లి*
*విజయవాడలో రూ.268 కోట్లతో అంబేద్కర్ విగ్రహం*
*స్మృతివనం నిర్మాణ పురోగతిపై సీఎం జగన్ సమీక్ష*
*మార్చికి నిర్మాణ పనులు పూర్తి.. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం*
విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదాన్ లో డాక్టర్ బీమ్ రావ్ అంబేధ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు స్వరాజ్ మైదాన్ లో స్మృతివనం ఏర్పాటు కోసం చేపట్టిన ప్రాజెక్టుకు రూ.268 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్మృతివనం పనుల పురోగతి వివరాలను అధికారులు సీఎం జగన్ కు వివరించారు. విగ్రహం తయారీతో పాటు, దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై సీఎం ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. విగ్రహం పీఠంతో కలుపి మొత్తం 206 అడుగుల పొడవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.268 కోట్లు కాగా పీఠం భాగంలో జీ ప్లస్ 2 నిర్మాణం చేపడుతన్నట్లు వివరించారు. 2 వేల మందికి సరిపడేలా ప్రాంగణంలోనే ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడి వినియోగిస్తూ డీపీఆర్ లో పేర్కొన్న విధంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. మార్చి నెలాఖరుకు విగ్రహ నిర్మాణ పనులు పూర్తిచేయడం కోసం జనవరి 31 కల్లా విగ్రహానికి సంబంధించి కాస్టింగ్ చేసిన భాగాలను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని, నిర్దేశిత సమయంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అత్యంత నాణ్యతతో, సందరీకరణ పనులు కనెక్టివిటీ రోడ్ల నుంచి చేపట్టాలని సూచించారు. పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. సమీక్షలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments are closed.