The South9
The news is by your side.
after image

ఆత్మకూరు అభివృద్దికి ఏడీఎఫ్ అంకురార్పణ.

*ఆత్మకూరు అభివృద్దికి ఏడీఎఫ్ అంకురార్పణ*

*నియోజకవర్గంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు సన్నాహాలు*

 

*ఆత్మకూరు నియోజకవర్గాన్ని సమగ్రంగా అన్ని రంగాల్లో అభివృద్ది కోసం అందరి సహాయ సహకారాలతో ‘ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు.*

 

*ఆత్మకూరులోని శ్రీధర్ గార్డెన్స్ లో ఈ నెల 10వ తేది ప్రముఖలచే ప్రత్యక్షంగా మరియు వర్చువల్ ద్వారా ఆత్మకూరు అభివృద్దికి ప్రత్యేక రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు హాజరుకావాలని గురువారం కోరారు.*

 

*నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో గల నిపుణులచే ప్రత్యక్ష, పరోక్ష సహయ సహకారాలు, సూచనలతో ఆత్మకూరు ప్రజల అభివృద్దికి సమిష్టిగా సహకరించేందుకు అందరూ కలసికట్టుగా సహకరించాలని, ఇది ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు.*

 

Post Inner vinod found

*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాను ఇటీవల కలిసినప్పుడు నియోజకవర్గం హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారులు ఏర్పాటు కావడం ద్వారా నియోజకవర్గంలో లాజిస్టిక్ పార్కు నిర్మించుకోవడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందుతుందని సూచించారన్నారు.*

 

*ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద రెండో మండలమైన మర్రిపాడుని అభివృద్ది చేసేందుకు నిపుణులతో చర్చించనున్నామని అన్నారు.*

 

 

Post midle

*తన సోదరుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసం ఆయన ఆశయాలను సాకారం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు వివరించారు. తన అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఫౌండేషన్ పేరున అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారన్నారు.*

 

*ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ను అత్యాధునిక హంగులతో ఎమ్ జి అర్ ఫౌండేషన్ ద్వారా తమ సొంత నిధులు కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులు పురోగతిలో ఉన్నాయన్నారు నియోజకవర్గంలో సోమశిల, ఏఎస్ పేట, సంగం, చేజర్ల మండలాలను పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి దాదాపు రూ.63 కోట్లకు ప్రతిపాదనలు అందచేశామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.*

 

*మరో జాతీయ రహదారి ఆత్మకూరు నియోజకవర్గంలో మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల మీదుగా కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు మంజూరై త్వరలో పనులు ప్రారంభమయ్యే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. తద్వారా ఆత్మకూరు పారిశ్రామికంగా వ్యవసాయ రంగంగా అభివృద్ది కావడం ఖాయమని అన్నారు.*

Post midle

Comments are closed.