తేదీ: 26-11-2022*
*స్థలం: విజయవాడ*
*రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండ….రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌కు అంజలి ఘటిస్తున్నాం: సీఎం జగన్*
72 ఏళ్లుగా రాజ్యాంగం సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసి అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏపీ సీఎం జగన్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాజ్యాంగం చాలా గొప్పదని, మనకు క్రమశిక్షణ నేర్పేన మంచి పుస్తకం అని, 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగం రూపొందించారన్నారు. భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని, మనకు క్రమశిక్షణ నేర్పే పుస్తకమని సీఎం జగన్ అన్నారు. 72 ఏళ్లుగా రాజ్యాంగం సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసిందని, అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌కు అంజలి ఘటిస్తున్నాం. 2023 ఏప్రిలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. నిరుపేదలకు, అనగారిన వర్గాలకు అధికార దుర్వినియోగం జరిగినప్పుడు వారి రక్షణకు ఈ రాజ్యాంగం ఎంతో దోహపడింది. దేశంలో అన్ని వర్గాల వారు స్వేచ్ఛగా జీవించేలా రాజ్యాంగంలో చట్టాలను పొందుపర్చడం జరిగిందన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గొప్ప వ్యక్తి అన్నారు. ఏపీలో రాజ్యంగంలో చెప్పిన విధంగా గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో మార్పులు తీసుకొచ్చాం” అని సీఎం జగన్ పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించామని వివరించారు. పాఠశాల్లో అన్ని వర్గాల వారికి సమానత్వం కల్పించడం జరిగిందన్నారు. ఇంగ్లిష్ మీడియంతో చదువులు చెప్పడం జరుగుతుందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ , ఎస్టీ ,బీసీ , మైనార్టీలకు రిజర్వేషన్ అమలు చేశామన్నారు. అన్ని వర్గాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం జగన్ తెలిపారు.
Comments are closed.