తేదీ : 17 -11 -2022*
తాడేపల్లి
*నేను అప్పుల మంత్రి అయితే మీరు అబద్దాల మంత్రా*
*కేవలం మోసం తప్ప 10 ఏళ్ళు గా చంద్రబాబు కుర్నూలుకి చేసిందేమి లేదు*
*త్వరలో 10,000 ఉద్యోగాల భర్తీకి సన్నాహం: మంత్రి బుగ్గన్న*
చంద్రబాబు నిన్న కర్నూల్ లో జరిగిన సభలో చేసిన వ్యాఖలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. ఈరోజు తాడేపల్లి లో జరిగిన విలేఖర్ల సమావేశం లో మంత్రి బుగ్గన మాట్లాడుతూ న్యాయ రాజధానిని వ్యతిరేకించే చంద్రబాబు కర్నూల్ లో అడుగు పెట్టడానికి అర్హులు కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఆర్ధికంగా కూరుకుపోయిందని ఆర్ధిక మంత్రి అప్పుల మంత్రిగా మారారు అన్న విమర్శను తిప్పికొడుతూ, తాను అప్పుల మంత్రి అయితే అనేక అబద్ధాలు ఆడిన చంద్రబాబు అబద్ధాలా మంత్రి అవుతారని చమత్కారంగా మాట్లాడారు.
కర్నూలు, రాయలసీమ ప్రజల మనస్సు గొప్పది కాబట్టి చంద్రబాబు ని అక్కడ అడుగుపెట్టనిచ్చారు అని చెప్పారు. తన నలబై ఏళ్ళ రాజకీయ చెరిత్రలో రాయలసీమ కి తాను ఎం చేసారో చెప్పాలని బుగ్గన్న ప్రశ్నించారు. కొత్త కొత్త పేర్లతో ఎదో చేస్తున్నారంటూ ప్రజలను మభ్య పెట్టారు తప్ప మరేమి కాదని విమర్శించారు. ఇన్నాళ్లుగా చంద్రబాబు చేసింది కేవలం మోసం మాత్రమే అని విరుచుకపడ్డారు.
ఊరికే నలబై ఏళ్ల రాజకీయ చెరిత్ర ఉందని చెప్పుకునే చంద్రబాబు అబద్ధాలకు ఆడేందుకు సైతం దిగజారారు అని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో నాలుగు వేల పాఠశాలలు తొలగించారని, ఆరు లక్షల విద్యార్థులు చదువులకి దూరం అయ్యారని చెప్పిన చంద్రబాబు కి మనసాక్షి ఉందా అని ప్రశ్నించారు. ఒక వైపు నాడు-నేడు ద్వారా జరిగే మంచి కళ్ళ ముందు కనబడుతూ ఉంటె ఇలాంటి ప్రచారం చెయ్యడం తగునా అని ప్రశ్నించారు. ఇలా ప్రతి రంగంలో ఎదో చెప్పేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు, రాష్ట్రం లో 13,200 కోట్లు పెట్టుబడులు సగటున వస్తుంటే మీకు కనబడట్లేదా అని ప్రశ్నించారు. తమ హయం లో ఇస్తాం అన్న ఇంటికొక ఉద్యోగం ఎం అయ్యిందో ప్రజలకి చెప్పాలని బుగ్గన్న గుర్తు చేసారు.
వైఎస్స్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక 2 లక్షల 10 వేల ఉద్యోగాలని కల్పించిందని త్వరలోనే మరో 10 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలియజేసారు. అందులో 6,511 పోలీస్ ఉద్యోగాలు 3 ,672 కోర్ట్ ఉద్యోగాలున్నటు తెలియజేసారు. టీడీపీ హయం లో మొత్తంగా వచ్చిన ఉద్యోగాలు కేవలం 34 వేలు మాత్రమే అని, అలాంటిది ఈరోజు టీడీపీ జగన్ ప్రభిత్వాన్ని తప్పు పట్టడం ఏంటి అని ప్రశ్నించారు.
ప్రజలు చంద్రబాబు చెప్పే అబద్దాలను నమ్మరని, ఈరోజు చంద్రబాబు ముంగిట ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పడానికి ఏమి లేదు కాబట్టి ఇలా ప్రజలను మోసం చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఆయనకు మోసం చెయ్యడం, వెన్నుపోటు పొడవడం కొత్తేమి కాదని బుగ్గన్న ఆరోపించారు.
Comments are closed.