The South9
The news is by your side.
after image

ఏపీలో బోద రహితంగా 5 జిల్లాలు

*ఏపీలో బోద రహితంగా 5 జిల్లాలు*

*వైద్య, ఆరోగ్య శాఖ విధానాలు భేష్*

*బోద వ్యాది నిర్మూలన చర్యలపై కేంద్రం ప్రశంస*

 

Post Inner vinod found

ఏపీలోని 5 ఉమ్మడి జిల్లాలను కేంద్ర ప్రభుత్వం బోద వ్యాధి రహిత జిల్లాలుగా గుర్తించింది. బోధ వ్యాధి నిర్మూలన కోసం వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న విధానాలను ప్రత్యేకంగా అభినందించింది. వ్యాధి నిర్మూలనా చర్యలను ఖచ్చితంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యపడిందని పేర్కొంది. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద (ఎన్‌ఎల్‌ఈపీ) అమలవుతున్న విధానం వల్లే రాష్ట్రంలో బోద కాలు, కుష్టి వ్యాధికి సంబంధిత వ్యాధులు అరికట్టడం సాధ్యం అయ్యిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2002 లో కేంద్ర ప్రభుత్వం బోదకాలు, కుష్టి వ్యాధి నిర్ములన కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఉత్తమ విధానాలు అమలు చేయడంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మరియు గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్న ఈ సమస్య ప్రస్తుతం పూర్తిగా నిర్ములించబడినట్లు కేంద్ర ప్రభుత్వం ఐదు బోద రహిత ఉమ్మడి జిల్లాల పేర్లను విడుదల చేసింది.

 

*మొదటి స్తానం లో ఉమ్మడి గోదావరి*

 

బోద వ్యాధిని అరికట్టడం లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ముందు నిలిచింది. దీనితో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను బోద రహిత జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశ , ఏఎన్ఎమ్, గ్రామ వలంటీర్ల ద్వారా అవగాహనా కార్యక్రమాలు కల్పించడంతో వ్యాధి నిర్మూలన సాధ్యపడింది. ఈ మేరకు మంత్రి విడదల రజిని, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణ బాబు జిల్లా అధికారులను అభినందించారు.

Post midle

Comments are closed.