*ఉజ్వల భవిష్యత్తుకు చదివే పునాది : ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: మర్రిపాడు ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులు ప్రారంభం*
*: కంటి వైద్యచికిత్సలు, స్కాలర్ షిప్ లు అందచేత*
*ఉజ్వల భవిష్యత్తుకు చదివే పునాది అని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన మర్రిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సీడ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన డిజిటల్ తరగతులను ఆయన ప్రారంభించారు.*
*అంతకు ముందుగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సౌలభ్యం కోసం సీడ్స్ స్వచ్చంద సంస్థ డిజటల్ ల్యాబ్ తో పాటు కంటి వైద్యం గదిని కూడా ఏర్పాటు చేశారు. ఆ గదులను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో చెట్లు నాటారు.*
*అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌలభ్యం కోసం సీడ్స్ స్వచ్చంధ సంస్థ ముందుకొచ్చి పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే కష్టపడి చదువుకోవాలని సూచించారు.*
*చిన్నతనంలో కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని, ఉన్నతస్థాయిలో రాణించవచ్చునని పేర్కొన్నారు. చాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి చెందిందని. సీడ్స్ స్వచ్చంధ సంస్థ దత్తత తీసుకోవడం ద్వారా ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.*
*అనంతరం విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల వంతున 13 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందచేశారు. అలాగే చదువుతో పాటు వైద్యం కూడా అవసరమని హెల్త్ కిట్లను పంపిణీ చేశారు.*
*విద్యార్థులకు అవసరమైన కంటి చూపు సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలుగా వైద్యగదిని కూడా ప్రారంభించారు.*
*అనంతరం విశ్రాంత ఐఏఎస్ అధికారి, సీడ్స్ సంస్థ ఫౌండర్ రామిరెడ్డి చంద్రమలేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సౌలభ్యం కోసం ఇప్పటికే కొన్ని పాఠశాలలను దత్తత తీసుకుని అభివృధ్ది చేస్తున్నామని అన్నారు.*
*అందులో భాగంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మర్రిపాడు మండలాన్ని కూడా దత్తత తీసుకోవాలని కోరారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పాఠశాలను దతత్త తీసుకుని అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.*
*అంతకు ముందుగా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు.*
Comments are closed.