*27-10-2022*
*విశాఖపట్నం*
*ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్న చంద్రబాబు*
*విశాఖ బ్రాండ్ ఇమేజ్ పై టీడీపీ కుట్రలు*
*ఉత్తరాంధ్రలో గెలిచి అమరావతికి మద్ధతిస్తారా అంటూ ఫైర్*
*ఏడాదిలోగా పరిపాలనా రాజధానిగా విశాఖ*
*మీడియాతో పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్*
అమరావతిలో తన బినామీల కోసం చంద్రబాబు ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు వెన్నుపోటు నాయకుడి వెంట ఉండి ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. అమరావతి క్యాపటిస్టుల యాత్ర నుంచి బినామీలు తప్పుకున్నా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు బుద్ధి రాలేదని విమర్శించారు. విశాఖ రాజధానికి అడ్డుపడుతున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్రకు ఏం కావాలో చెప్పాల్సిన నేతలు అమరావతి కోసం పాకులాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో మంత్రి గుడివాడ అమర్ నాథ్ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో 22 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రకు ఏం చేశారో ఇక్కడి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి (శుక్రవారం) నుంచి వారం రోజుల పాటు టీడీపీ విశాఖలో తలపెట్టిన కార్యక్రమాలు చంద్రబాబుకు ఉత్తరాంధ్రపై ఉన్న అక్కసును తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రపై విషం చిమ్మి అమరావతి వైపు పెట్టుబడులు వెళ్లేలా చేయడమే ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు ఇంకెంత కాలం చంద్రబాబు బూట్లు నాకుతారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అంటే గంజాయి సాగు జరుగుతుందని పంటలు పండవని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అమరావతికి అడ్డు పడటం లేదని అమరావతితో పాటు ఉత్తరాంధ్రను కూడా అభివృద్ధి చేయాలని కోరుకోవడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి పెట్టుబడులకు నష్టం వస్తుందని చంద్రబాబు బినామీలకు భయం పట్టుకుందన్నారు.
*ఏడాదిలోగా రాజధానిగా విశాఖ*
వచ్చే ఏడాదిలోపు విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. విశాఖ రాజధాని ప్రకటనకు గర్జనలో ప్రజల ఆమోదం లభించదని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్ధతు ఉందని దీనిపై త్వరలోనే బిల్లు ప్రవేశపెడతామని వివరించారు. రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖను రాజధాని ఎందుకు వద్దో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నౌకాదళం, వైమానిక కనెక్టివిటీ ఉందన్నారు. టీడీపీ ఉత్తరాంధ్రపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ మండిపడ్డారు. రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రుషికొండలో పర్యాటక అభివృద్ధి పనులు జరుగుతుండటంతో టీడీపీకి భయం పట్టుకుందన్నారు. అందుకే అభివృద్ధి పనులు, ప్రాజెక్టు పనులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పరిపాలనా రాజధానిగా నిలుస్తున్న విశాఖలో రుషికొండను మరింత అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలని అమర్‌నాథ్ హెచ్చరించారు. టీడీపీ జనసేన పార్టీల పొత్తుతో పవన్ కళ్యాణ్ జనసైనికులను చంద్రబాబుకు బానిసలుగా మారుస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో పవన్ పార్టీ నేతలను చంద్రబాబుకు అమ్మేస్తారని విమర్శించారు.
Comments are closed.