తేదీ: 13-10-2022,
- అమరావతి.
*ఏపీఈడీబీ సీఈవో భరత్ గుప్తాని కలిసిన తెలుగు రాష్ట్రాల బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గెరత్ ఓవెన్*
*ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశోధన రంగాలలో ఏపీతో భాగస్వామ్యానికి ఆసక్తి*
అమరావతి, అక్టోబర్, 13 ; ఏపీఈడీబీ సీఈవో డాక్టర్ నారాయణ భరత్ గుప్తాని తెలుగు రాష్ట్రాల బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ కలిశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశోధనా రంగాలలో ఆంధ్రప్రదేశ్ తో భాగస్వామ్యానికి ఆసక్తి చూపారు. విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండస్ట్రీ 4.0లో భాగస్వామ్యానికి బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ సానుకూలత వ్యక్తం చేశారు. పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో తోడ్పాటుకు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ తోడ్పాటునిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనువైన ప్రాంతాలు, రంగాలపై ఏపీ ఈడీబీ సీఈవో డిప్యూటీ హై కమిషనర్ నేతృత్వంలోని బృందానికి ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీ ప్రత్యేకతలు, సానుకూలతలను తెలిపే వీడీయో ప్రదర్శించారు. విదేశీ ప్రతినిధుల బృందం కోరినట్లు విశాఖపట్నం,అనంతపురం,చిత్తూరులో ఆయా రంగాలలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని ఏపీఈడీబీ సీఈవో భరత్ గుప్తా వెల్లడించారు. రెడీ బిల్డ్ షెడ్ లలో ప్లగ్ అండ్ ప్లే విధానంలో యూనిట్ల ఏర్పాటుపైనా చర్చించారు. వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి, తిరుపతి ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ క్లస్టర్ లలో షెడ్లు సిద్ధంగా ఉన్నాయని సీఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్యం, పెట్టుబడుల విభాగం హెడ్ వరుణ్ మాలి, ఇన్నోవేషన్ & టెక్నాలజీ హెడ్ కేటీ.రంజన్, అంతర్జాతీయ వాణిజ్య విభాగం సీనియర్ సలహాదారు పీయూష్ అవస్తి, ఈడీబీ ప్రతినిధుల బృందం, తదితరులు హాజరయ్యారు.
——-
Comments are closed.