The South9
The news is by your side.
after image

ఎస్సీ ఎస్టీలపై దాడులు పూర్తిస్థాయిలో అరికట్టాలి జాయింట్ కలెక్టర్ కూర్మానాధ్

ఎస్సీ ఎస్టీలపై దాడులు పూర్తిస్థాయిలో అరికట్టాలి

జాయింట్ కలెక్టర్ కూర్మానాధ్

జిల్లాలో ఎస్ సి, ఎస్.టీ.లపై జరుగుతున్న దాడులకు సంబంధించి నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించి, బాధిత కుటుంబాలకు న్యాయం అందించగలిగే విధంగా అధికారులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్. కూర్మనాథ్ పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన జిల్లా స్ధాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ (ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం) సమావేశానికి జాయింట్ కలెక్టర్ ఆర్. కూర్మనాథ్, అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అత్యాచార చ‌ట్టం క్రింద న‌మోదు చేసిన కేసుల ప‌రిష్కారంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించి, బాధిత కుటుంబాలకు న్యాయం అందించగలిగే విధంగా అధికారులు పనిచేయాలన్నారు.

Post Inner vinod found

కేసుల వారీగా స‌మీక్షించి, వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, రెవెన్యూ, పోలీసు అధికారులకు సూచించారు. గడచిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించుకోవాలని అన్నారు. అలాగే ప్రస్తుతం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తదుపరి జరిగే సమావేశం నాటికి అమలు చేయాలని జాయింట్ కలెక్టర్, అధికారులను ఆదేశించారు. కమిటీ సభ్యులు ఎస్‌సి, ఎస్‌టి ల సంక్షేమానికి సంబందించి కమిటీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా సంబందిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నత న్యాయస్ధానంలో పెండింగ్ లో వున్న కేసుల విషయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సంప్రదించి సత్వరం కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్, అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా కేసుల విచారణ వేగవంతం కావాలన్నారు. ఆర్డీవోలు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈ సంధర్బంగా కమిటీ సభ్యులు ఎస్‌సి, ఎస్‌టి లపై జరిగిన దాడులు గురించి మరియు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.జిల్లాలోని ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం పై ప్రజలకు ఆవగాహన కలిగే విధంగా బ్యానర్లను, వాల్ పోస్టర్స్ ను ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు, అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది.

తొలుత సమావేశంలో జిల్లాలో నమోదైన కేసుల వారీగా చర్చిండం జరిగింది.

Post midle

ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు శ్రీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, అదనపు ఎస్.పి. హిమవతి, జిల్లా ఎస్.సి సంక్షేమం, సాధికారిత అధికారి రమాదేవి, నెల్లూరు, కావలి, ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు మాలోల, శీనా నాయక్, కరుణకుమారి, కమిటీ సభ్యులైన జిల్లా విద్యా శాఖాధికారి రమేశ్ కుమార్, జిల్లా ఉపాధికల్పనాధికారి సురేష్, మున్సిపల్ శాఖ ఎ.డి. కె. ప్రదీప్, కమిటీ సభ్యులు కె. రఘు, శేషం సుదర్శనం, పి. సుబ్బరాయుడు, వి. బాలయ్య , కె.సి.పెంచలయ్య, డి. ప్రసన్న గణపతి, ఖజారసూల్, ఏం. సురేంద్ర రెడ్డి, సాయి ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————-

Post midle

Comments are closed.