ఆస్తి పన్ను కట్టిన పరిశ్రమల పరిసరాలను సకలవసతులతో ‘మోడల్’గా తీర్చిదిద్దాలి :ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది
తేదీ: 03-08-2022,
అమరావతి.
*ఒంగోలు ఎస్ఈజెడ్ ని పరిశీలించిన ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది*
*ఎస్ఈజెడ్ లో గల సమస్యల పరిష్కారంపై స్థానిక పారిశ్రామికవేత్తలతో ఎండీ సమీక్ష*
*ఆస్తి పన్ను కట్టిన పరిశ్రమల పరిసరాలను సకలవసతులతో ‘మోడల్’గా తీర్చిదిద్దాలి*
అమరావతి, ఆగస్ట్, 03 : ఒంగోలు గ్రోత్ సెంటర్ లోని జోనల్ మేనేజర్ కార్యాలయం, ఎస్ఈజెడ్ లను ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది పరిశీలించారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో స్థానికంగా ఎదురవుతున్న ప్రధాన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఎస్ఈజెడ్ లో అక్కడక్కడ డ్రైనేజ్ లు, రోడ్లు, వీధి దీపాల నీటిసరఫరా వంటి మౌలిక వసతుల కొరత ఉందని చెప్పిన పారిశ్రామికవేత్తల అభిప్రాయాలపై ఎండీ స్పందిస్తూ .. వెంటనే వాటిని ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. జులై 31 , 2022 లోగా ఆస్తి పన్ను ఒకేసారి కట్టిన పారిశ్రామికవేత్తలకు 5 శాతం రాయితీ ఏపీఐఐసీ అవకాశాన్ని ఎస్ఈజెడ్ లోని పరిశ్రమలు చక్కగా ఉపయోగించుకున్నాయని ఎండీ అభినందించారు. పన్ను చెల్లింపులు చేసిన పరిశ్రమల పరిసరాల్లో మౌలిక వసతుల ఏర్పాటును తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని జెడ్ ఎం వెంకటేశ్వర్లును ఆదేశించారు. తద్వారా రాయితీ అవకాశాన్ని వినియోగించుకోని వారు కూడా ముందుకు వస్తారని ఆయన పేర్కొన్నారు. జెడ్ ఎం కార్యాలయాన్ని గ్రోత్ సెంటర్ లోనే కొనసాగించేలా చర్యలు చేపట్టాలని ఎండీని స్థానిక పారిశ్రామికవేత్తలు కోరారు. గ్రానైట్ పరిశ్రమలే అధికంగా ఉన్న ఒంగోలు ఎస్ఈజెడ్ లో గ్రానైట్ తయారీ తర్వాత మిగిలిన రాళ్లు, రప్పలను అక్కడే వేస్తుండడంపై స్పందిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఎండీ ఆదేశించారు. ఆ రాళ్లు, నిరుపయోగమైన వాటిని స్టోన్ క్రషింగ్ యూనిట్ ఏర్పాటు ద్వారా ముగింపు పలికే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమాలోనచలు జరిపారు. పరిశ్రమల నుంచి వచ్చే వేస్ట్ ని నిర్మాణరంగంలో వినియోగించుకునే అవకాశాలపైనా పరిశీలించాలని ఆదేశించారు. పరిశ్రమలకు కొన్నింటికి నీటి కొరత ఉన్నట్టు తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అలాంటి పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, ఎంత నీరు కావాలనే వివరాలు సేకరించి పంపితే ఆ సమస్య పరిష్కారం చేస్తామన్నారు. అనంతరం ఎస్ఈజెడ్ లో అందుబాటులో ఉన్న ఖాళీ భూములను ఎండీ సుబ్రమణ్యం పరిశీలించారు. గ్రోత్ సెంటర్ లో ఏర్పాటైన సాఫ్ట్ వేర్ డెవలపర్ యూనిట్ “టెక్ బుల్”ని ఎండీ విజిట్ చేశారు. అవకాశాలను బట్టి స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించి తద్వారా ఉపాధి పొందే విధంగా చొరవ చూపాలని ఎండీ పేర్కొన్నారు. నాయుడుపేట, తిరుపతి ప్రాంతాల్లోని ఎస్ఈజెడ్ లలో కూడా ఖాళీగా ఉన్న చోట టెక్ బుల్ ని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, చీఫ్ ఇంజనీర్(సౌత్) వివేకనందరెడ్డి, జోనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, జీఎం గెల్లి ప్రసాద్, డిప్యూటీ జోనల్ మేనేజర్ భాను, ఏపీఐఐసీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
———–
Comments are closed.