The South9
The news is by your side.
after image

సంక్షేమ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

*సంక్షేమ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: నెల్లూరుపాళెం సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం*

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనతో ప్రజల్లో రోజురోజుకి విశ్వాసం పెరుగుతుందని, ప్రతి ఇంట్లో ప్రభుత్వానికి దీవెనలు అందుతున్నాయని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.*

*బుధవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహంచారు. ఈ సందర్భంగా నెల్లూరుపాళెంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.*

*ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయని, చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ పకాలపై రూపొందించిన పథకాల వివరాలను లబ్దిదారులకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అందచేశారు.*

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ పథకాలు అందుకున్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తుందన్నారు.*

Post Inner vinod found

*ప్రజాసంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీలనే కాకుండా అనేక సంక్షేమ పథకాలను అందితూ ప్రజల ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని పేర్కొన్నారు.*

*నవరత్నాల పథకాలతో సంక్షేమంతో పాటు అభివృద్ది జరుగుందని, ఈ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కనీసం ఒకటి నుంచి 6, 7 వరకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు*

Post midle

*అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారంతో పాటు ప్రజలతో మమేకమయ్యేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఒక వారధిలో పనిచేస్తుందని పేర్కొన్నారు.*

*గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్న సమయంలో పలువురు చిన్నారులు ఆయన వద్దకు రావడంతో ఎలా చదువుతున్నారు, పాఠాలు ఎలా చెబుతున్నారంటూ వారిని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.*

*ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం చిన్నారులకు, గర్భవతులకు, బాలింతలకు అందేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు.*

Post midle

Comments are closed.