*ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చూడాలి : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామాలలో ప్రజలు తెలుపుతున్న ప్రతి సమస్యను అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు సమన్వయం చేసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.*
*గురువారం మండల కేంద్రమైన ఏఎస్ పేట లోని బిట్ -1 సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తొలి రోజు బుధవారం గ్రామస్తులు తెలిపిన సమస్యలపై ఆయన మండలంలోని అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన పలు సమస్యలను అక్కడి అధికారులు దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని సూచించారు.*
*రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందచేస్తున్న ప్రతి పథకం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని అన్నారు. ఏదైనా కారణాల వల్ల అర్హులైన వారికి ప్రభుత్వం పథకం అందలేదని తమకు తెలిపితే ఆ పథకం ఎందువల్ల ఆ లబ్దిదారుడికి రాలేదో, అధికారులు ఏ చర్య తీసుకుంటే వారికి వర్తిస్తుందో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.*
*అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన అభివృద్ది పనులపై ఆయా శాఖల అధికారులు నివేదికలను రూపొందించి తెలియచేయాలని సూచించారు. వాలంటీర్లు తమకు ఇచ్చిన సర్వే పుస్తకాల ద్వారా ప్రతి కుటుంబానికి పొందుతున్న లబ్ది, వారికి అర్హత ఉండి లభించని పథకాలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు.*
*పలువురు అర్జిదారులు ఇచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రతి సమస్యను అధికారులు నమోదు చేసుకుని వాటిని పరిష్కరించేలా చూాడాలని ఆదేశించారు.*
*సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది పనులపై, నవరత్నాల పథకాలపై ప్రధానంగా దృష్టి సారించాలని, ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలని సూచించారు.*
Comments are closed.