తేదీ: 05-07-2022,
అమరావతి.
*పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు*
*ఈవోడీబీ 2020 ర్యాంకింగ్స్ లో ఏపీని అగ్రగామిగా నిలపడంపై సీఎం అభినందన*
*ఇదే కృషిని కొనసాగించాలన్న ముఖ్యమంత్రి ప్రశంసలు మరింత స్ఫూర్తి నింపాయి: పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్*
అమరావతి, జూలై, 05 : సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ -ఈవోడీబీ)లో ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలిపిన పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల కృషిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించినట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. పూర్తి స్థాయి సర్వే ఆధారంగా 97.89 శాతంతో వరుసగా రెండో ఏడాది, 2020 ఈవోడీబీ ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలపడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 15 రంగాల్లో 301 సంస్కరణల ప్రయోజనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ర్యాంకుల్లో మొదటి స్థానం దక్కడం మరింత ప్రత్యేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారన్నారు. ఇదే కృషిని కొనసాగించి పారిశ్రామికంగా మరింత రాణించి ఏపీని అన్ని రంగాలలో అగ్రగామిని చేసే దిశగా అడుగులు వేయాలంటూ ముఖ్యమంత్రి ప్రశంసించడం ప్రోత్సాహంతో పాటు బాధ్యతతో కూడిన స్ఫూర్తిని నింపాయన్నారు.
పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో , ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, పరిశ్రమల శాఖలో వస్త్ర విభాగం చేనేత ముఖ్యకార్యదర్శి కె.సునీత తదితర ఉన్నతాధికారుల బృందం మంగళవారం సాయంత్రం సీఎం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.
Comments are closed.