The South9
The news is by your side.
after image

ప్రభుత్వ స్థలాలలో పార్టీల చిహ్నాలు, ప్రభుత్వ లోగో లు ఎక్కడైనా ఉంటే తొలగించండి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు

ఎన్నికల కోడ్ ను పగడ్బందీగా అమలు చేయాలి

.. ప్రభుత్వ స్థలాలలో పార్టీల చిహ్నాలు, ప్రభుత్వ లోగో లు ఎక్కడైనా ఉంటే తొలగించండి

జిల్లా కలెక్టర్ చక్రధర బాబు

ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేయాలని, ఎన్నిక నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్  చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.

Post Inner vinod found

సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆత్మకూరు ఉప ఎన్నిక ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ బస్సులు, రేషన్ పంపిణీ వాహనాలు, ఇతర అన్ని ప్రభుత్వ వాహనాలపై ఉన్న పార్టీల చిహ్నాలు, ప్రభుత్వ లోగో లు, నాయకుల ఫోటోలను తొలగించాలని చెప్పారు. మద్యం రవాణా, నగదు పంపిణీ, ఇతర విలువైన వస్తువుల సరఫరాపై గట్టి నిఘా ఉంచాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల సిబ్బందికి అవసరమైన స్టేషనరీ, ఫర్నిచర్, మంచినీరు, రాకపోకలకు వాహనాలు, ఇతర కనీస సదుపాయాలను సమకూర్చాలని ఆదేశించారు. ముఖ్యంగా నోడల్ ఆఫీసర్ లు వారికి కేటాయించిన విధులను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అభ్యర్థుల నామినేషన్ కు సంబంధించి ర్యాలీల ఖర్చు, పత్రికల్లో అభ్యర్థుల ప్రకటనలకు రేట్లు నిర్ణయించి ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణను పూర్తి చేయాలన్నారు. ఈవీఎంలు, వి వి ప్యాట్లను ముందస్తుగా సరి చూసుకోవాలన్నారు. కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని, కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు.

 

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ హరేంధిరప్రసాద్, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి, డిఎఫ్ఓ షణ్ముఖ కుమార్, ఏఎస్పీ హిమవతి, డిఆర్వో వెంకట నారాయణమ్మ, జెడ్పీ సీఈవో వాణి, తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్, ఆత్మకూరు ఆర్టీవో బాపిరెడ్డి, డిఆర్డిఎ, డ్వామా పిడిలు సాంబశివారెడ్డి, తిరుపతయ్య, డిపిఓ ధనలక్ష్మి తదితర నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Post midle

…………………….

Post midle

Comments are closed.