గౌతమన్న ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తా :వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ చార్జి మేకపాటి విక్రమ్ రెడ్డి.
*గౌతమన్న ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తా*
*-వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ చార్జి మేకపాటి విక్రమ్ రెడ్డి*
*నియోజకవర్గంలో ప్రతి గడపకు పర్యటిస్తా*
*సంగంలో ఆత్మీయ సమావేశం*
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్దిని కొనసాగిస్తూ గౌతమన్న ఆశయ సాధన కోసం అహర్నిశ్నలు కృషి చేస్తానని ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన సంగంలోని తుంగా దయాకర్ రెడ్డి కళ్యాణ మండపంలో నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలసి సంగం మండల వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
*సంగం మండల వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డికి, ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ మేకపాటి విక్రమ్ రెడ్డిలకు సంగం మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరిస్తూ ఆహ్వనం పలికారు.*
*ఈ సందర్భంగా బస్టాండ్ కూడలి సెంటర్ లోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీగా సంగం ఆత్మీయ సమావేశ ప్రాంగణంకు తీసుకెళ్లారు.*
*ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు తన సోదరుడిని రెండు మార్లు ఆశీర్వదించి శాసనసభ్యునిగా చేశారని, ఆయన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది పనులు చేశారన్నారు. ఆయన చేసిన అభివృద్ది పనులను కొనసాగిస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు*
*త్వరలోనే గౌతమ్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తానని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని అన్నారు*
*నియోజకవర్గ ప్రజలు తన సోదరుడిలాగే తనను ఆశీర్వదించాలని, ఎల్లప్పుడూ మీకు అండగా ఉండి సేవ చేస్తానని పేర్కొన్నారు*.
*నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన రాజకీయ వారసునిగా మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు తమ కుటుంబసభ్యులమంతా కలసి నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిపామని, ఆయన ఆశీస్సులతో మేకపాటి విక్రమ్ రెడ్డి మన గౌతమ్ రెడ్డి స్థానంలో వస్తున్నారని, నియోజకవర్గ ప్రజలంతా ఆయనను ఆశీర్వదించాలని కోరారు*
*జిల్లాలోని రెండు బ్యారేజ్ లు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారని, సంగం బ్యారేజ్ కు మన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ గా నామకరణం చేశారని, ఆ బ్యారేజ్ వద్దే మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కూడా చేయనున్నట్లు తెలిపారు. ఈ బ్యారేజ్, గౌతమ్ రెడ్డి విగ్రహం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారని అన్నారు*.
*మేకపాటి గౌతమ్ రెడ్డి 2004 నుండి నాతో పాటు రాజకీయాల్లో ఉన్నారని అన్నారు. 1983 నుంచి రాజకీయాల్లో ఉన్న తాను 1985లో ఉదయగిరి శాసనసభ్యునిగా గెలుపొందానని అనంతరం నరసారావుపేట, నెల్లూరు పార్లమెంట్ సభ్యునిగా గెలుపొంది ప్రజల మన్ననలను పొందానని పేర్కొన్నారు. మచ్చలేని రాజకీయ జీవితం మాది అని, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు మేకపాటి విక్రమ్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.*
*దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు ఎన్నో విదేశి పర్యటనలు చేయాలని తనతో చెప్పేవారని, పారిశామ్రికంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయలనే సంకల్పంతోనే ఆయన విశేష కృషి చేశారన్నారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే శాఖలు మంత్రి గౌతమ్ రెడ్డి నిర్వహించారని, ఎన్నో పెట్టుబడులు తెచ్చే దిశగా ఆయన విశేషంగా కృషి చేశారన్నారు.*
*ఈ సందర్భంగా సంగం మండలంలోని అన్ని పంచాయతీల నాయకులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డిలను శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పంచాయతీల వారీగా నాయకులను విక్రమ్ రెడ్డి ఆత్మీయంగా పలకరించడంతో హర్షం వ్యక్తం చేశారు.*
Comments are closed.