The South9
The news is by your side.
after image

మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు

మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు
అమరావతి,10 ఏప్రిల్:అమరావతి సచివాలయం వద్ద 11వతేది సోమవారం ఉ.11.31 గం.లకు జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయి.రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్.జగన్మోహన్ రెడ్డిచే ఎంపిక చేయబడి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో మంత్రులుగా ఎంపికైన వారిని సోమవారం ఉదయం గవర్నర్ చేతులమీదగా ప్రమాణం చేయించనున్నారు.ఈమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రొటోకాల్ విభాగంతోపాటు వివిధ శాఖల అధికారులు సభా వేదిక వద్ద పెద్దఎత్తున్న చేపట్టిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోలీసుశాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.ఇప్పటికే సభా వేదిక, ప్రముఖులు,మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారి కుటుంబ సభ్యులు,అఖిల భారత సర్వీసుల అధికారులు,మీడియా ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా వేరువేరు గేలరీలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆదివారం రాత్రికి పూర్తిచేయనున్నారు.
మంత్రులుగా ఎంపికైన వారిని ఒక్కొక్కరినీ సభా వేదికపైకి ఆహ్వానించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతులమీదగా ప్రమాణం చేయిస్తారు.ఈప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అందరూ వీక్షించేందుకు వీలుగా సభా ప్రాంగణంలో ప్రత్యేక ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేస్తున్నారు.ఈప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రచారం చేసేందుకు సమాచారశాఖ ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తోంది. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సభా వేదిక ప్రకన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద రాష్ట్ర గవర్నర్,రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన మంత్రివర్గ సభ్యులతో కలిసి గ్రూపు పొటో దిగేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు.గ్రూపు పొటో అనంతరం సభా వేదికను ఆనుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో రాష్ట్ర గవర్నర్,రాష్ట్ర ముఖ్యమంత్రి,నూతన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు,ఇతర ప్రముఖులకు హైటీ ఏర్పాటు చేశారు.సోమవారం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని పలుమార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించ నున్నారు.ముఖ్యంగా కరకట్ట రోడ్టును రాష్ట్ర గవర్నర్,రాష్ట్ర ముఖ్యమంత్రి,మంత్రులు,ఎంపి, ఎంఎల్సి,ఎంఎల్ఏలు,ఉన్నతాధికారులు,ఇతర ప్రముఖుల వాహనాలు వెళ్లేందుకు వీలుగా రిజర్వు చేశారు.మిగతా వాహనాలను వేరు వేరు మార్గాల్లో సభా ప్రాంగణానికి చేరుకునేలా పోలీస్ అధికారులు ట్రాఫిక్ మళ్ళింపు ఏర్పాట్లు చేస్తున్నారు.
సౌండ్ సిస్టమ్,మీడియా గేలరీ తదితర ఏర్పాట్లను పరిశీలించిన సమాచారశాఖ కమీషనర్.
మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి సభా వేదికవద్ద పబ్లిక్ అడ్రస్ సిస్టమ్,మీడియాకు చేస్తున్నఏర్పాట్లను ఆదివారం సమాచారశాఖ కమీషనర్ టి.విజయ కుమార్ రెడ్డి పరిశీలించారు.అలాగే లైవ్ కవరేజి చేసే రైజర్,మంత్రుల గ్రూపు పొటో తీసేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఆయన వెంట సమాచారశాఖ అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత,జాయింట్ డైరెక్టర్లు పి.కిరణ్ కుమార్,టి.కస్తూరి భాయి,డిప్యూటీ డైరెక్టర్ ఐ.సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Post midle

Comments are closed.