చనిపోయిన వ్యక్తి పై ఆరోపణలు వద్దు- దమ్ముంటే నాతో ఢీ కొట్టు- ఆనం కు రామ్ కుమార్ రెడ్డి సవాల్
నోరు అదుపులో పెట్టుకో- ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పై నేదురుమల్లి ఫైర్
విశ్వసనీయత రాజకీయాలు చేయాలి-అసత్యపు ఆరోపణలు సరికాదు..
చనిపోయిన వారిపై ఆరోపణలు చేస్తే ఖబడ్దార్..
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకొనేదిలేదు- రామ్ కుమార్ రెడ్డి
రాపూరు, కలువాయి ప్రజలు శ్రీ బాలాజీ జిల్లాలో కొనసాగాలి అంటున్నారు
వెంకటగిరి,గూడూరు నియోజకవర్గాలాన్ని బాలాజీ జిల్లాలో కలపడం అదృష్టం
ఆనం అంటే ద్రోహం అనేది అందరికి తెలుసు
2009లో అనియ భిక్ష పెట్టింది నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి
2009లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న ప్పుడు గొర్రెలు కాస్తున్నవా..
ఆర్థిక మంత్రిగా ఉన్నావ్ గా ఏమి చేస్తున్నావ్ అప్పుడు..
ప్రజలను తప్పుదోవ పట్టిస్తే రాజకీయ పుట్టగతులూ వుండవ్
ఆనం ..ముందు నీవు ప్రతిపక్షమా.. అధికార పక్షమా చెప్పు
కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ధ్వజం
నెల్లూరు జిల్లాలోనే రాపూరు, కలువాయిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి నిరాహార దీక్ష చేపట్టిన విషయం అందరికి తెలిసిందే, కానీ నియోజకవర్గాల పునర్విభజనలోస్వార్థరాజకీయం కోసం.. నాటి కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి రాపూరు, కలువాయి వాసులకు ద్రోహం చేశారని వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు ఆనంరామనారాయణ రెడ్డి విమర్శలు చేయడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడిఎక్కాయి, ఆనం విమర్శలకు నేదురుమల్లి అభిమానులు , వైసీపీలోని నాయకులు, కార్యకర్తలు కూడా ఆనం తిరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు వైసీపీ నేత, బాపట్ల, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్, కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి కూడా ఆనం తీరుపై మండిపడ్డారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి స్వగృహంలో వైసీపీ నేతలతో కలిసి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలపునర్విభజనను స్వాగతిస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో ఉన్న ప్రతీ నియోజకవర్గ ప్రజలు హర్షిస్తున్నారు అని తెలిపారు. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే శ్రీ బాలాజీ జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు కలిశాయి అని ఆయనచెప్పుకొచ్చారు.
ముఖ్యంగా శ్రీ బాలాజీ జిల్లా అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందింది అనీ, త్వరలోనే గూడూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ బాలాజీ జిల్లా లో కలవడం వలన ఎంత మేలు జరుగుతుందో తెలుస్తోంది అన్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని ప్రతీ పక్ష,వామపక్షా పార్టీలు మాత్రం నెల్లూరు జిల్లాలో గూడూరు కొనసాగాలి అనీ ప్రకటనలు చేస్తున్న, మెజారిటీ ప్రజలు మాత్రం శ్రీ బాలాజీ జిల్లాలోనే కొనసాగుతాము అనీ చెబుతున్నారు అనీ తెలిపారు. వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో మాత్రం ప్రతీ పక్ష, వామపక్షాలు ఒక్క ప్రకటన కూడా ఇవ్వడం లేదు అన్నారు.కారణం శ్రీ బాలాజీ జిల్లా ప్రాముఖ్యత గురుంచి వారికి తెలుసు కాబట్టి అని చెప్పారు.
ఇటీవల వెంకటగిరి నియోజకవర్గశాసనసభ్యులు ఆనంరామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో కలపడం వల్లతీవ్రనష్టంజరుగుతుందని, అందువల్ల జరిగే నష్టాన్ని తెలిపేందుకే దీక్షచేస్తున్నాను చెప్పడం హాస్యాస్పదంగా ఉందిఅన్నారు. రాపూరు, కలువాయి వాసులకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ద్రోహంచేశారని ఆరోపణలు చేయడం చూస్తూ ఉంటే ఆయనకు మతిభ్రమించిందిఅనీ అర్ధం అవుతుంది అన్నారు.నాడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేసి ఆ తరువాత ఎమ్మెల్యే గా ఓడిపోయి ఇంటి దగ్గర ఉన్న నిన్ను మా తండ్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కారులో ఎక్కించుకుని పోయి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించి మంత్రిని చేశారు అనీ గుర్తు పెట్టుకో అనీ ఆనం తీరుపై ధ్వజమెత్తారు.
రాపూరు నియోజకవర్గం ఉన్నప్పుడు టీడీపీ, కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన సంగతి గుర్తు చేసుకో అనీ రామ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. గూడూరు,వెంకటగిరి నియోజకవర్గాలలో ప్రజలు ఎప్పుడూ మా కుటుంబ సభ్యులు అనీ తెలిపారు. 1999, 2004 లో మా తల్లిగారు నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఎమ్మెల్యే గా గెలుపొందిన, 2019 లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంకటగిరి గెలుపు కోసం కృషి చేయాలి అని ఆదేశాలు ఇవ్వడంతో తాను వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండల,గ్రామాల్లో సభలు పెట్టి ఆనం గెలుపుకు కృషి చేశాను అని, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు అప్పగించిన వాటిని సమర్ధవంతంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
నాడు గొర్రెలు కాస్తున్నవా…
2009లోనెల్లూరు జిల్లాలో నియోజకవర్గాలు పునర్విభజన( డిమానిటేషన్ )జరుగున్న సమయంలో కమిటీ సభ్యులు గా నాటి పార్లమెంట్ సభ్యులు మాజీముఖ్యమంత్రినేదురుమల్లి జనార్ధన్ రెడ్డి,వెంకట స్వామి, వై ఎస్ వివేకానంద రెడ్డి లతో పాటు 5 మంది శాసన సభ్యులు ఉన్నారు అని గుర్తుచేశారు. రాపూరు తో పాటు అల్లూరు నియోజకవర్గం కూడా పోయి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ అయ్యింది అన్నారు. ఆ సమయంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి గా తమరు రాపూరు, కలువాయి ప్రజల గురుంచి ఆలోచన చేయలేదు,పోరాటాలు చేయలేదు,కనీసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు అప్పుడు గొర్రెలు కాస్తూ కూర్చున్నారా అంటూ ఎద్దవా చేస్తూ ఆనం తీరు పై రాం కుమార్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఆనం మీరు అధికార పక్షమా.. ప్రతీ పక్షమా
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతీ పార్లమెంట్ ను ఒక్క జిల్లాగా చేయబోతున్నాం అనీ చెప్పి రెండున్నర ఏళ్ల తరువాత ముఖ్యమంత్రి జిల్లాల పునర్విభజనను ప్రకటన చేస్తే అందరూ కూడా స్వాగతిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా శ్రీ బాలాజీ జిల్లా లో వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలు కలవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో రాపూరు, కలువాయి వాసులు కూడా మాకు మంచి రోజులు వచ్చాయి, మాకు దరిద్రం వదిలింది అంటున్న నేపథ్యంలో మీ స్వార్ధ రాజకీయాలు కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేగా దీక్ష చేయడం సిగ్గు లేదా అని రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
చనిపోయిన వ్యక్తి పై కాదు- నన్ను ఢీ కొట్టు
దివంగత మహానేత డాక్టర్ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అభివృద్ధికి మారుపేరు అని, ఆయన ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టారు. వారిలో ఆనం సోదరులు కూడా ఉన్నారు అనీ రాం కుమార్ రెడ్డి గుర్తు చేస్తూ, చనిపోయిన వ్యక్తి పై పదే పదే కాంగ్రెస్‌లోని ఓ పెద్దమనిషి రాపూరు, కలువాయి వాసులకు ద్రోహం చేశారని చెప్పి, ఇప్పుడు విధిలేక చెబుతున్న నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి వలన ద్రోహం జరిగిందని అసత్యపు ఆరోపణలు చేయడం తగదు అనీ, దమ్ముంటే నాతో ఢీ కొట్టు అంటూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి రామ్ కుమార్ రెడ్డి సవాలు విసిరారు.ఇంకోసారి జనార్దన్ రెడ్డి పై విమర్శలు చేస్తే అందుకు తగ్గ గుణపాఠం చెబుతాం అని హెచ్చరించారు.
ఆనం రామనారాయణ రెడ్డి చరిత్ర అందరికి తెలుసు
ఆనం రామనారాయణ రెడ్డి ఏమిటో,ఆయన చరిత్ర ఏమిటో జిల్లా, రాష్ట్ర ప్రజలు తెలుసు అని రాం కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి 2009లో నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చి ఏ విధంగా ద్రోహం చేశారో అందరికి తెలుసు అన్నారు. నాడు వైఎస్సార్ చేసిన మేలుకు ఆయన చేసిన విన్యాసాలు అన్నీ కూడా తెలుసు అన్నారు. గురిగింజ నలుపు ఎరగనట్లు ఆనం నీతి వాక్యాలు చెబుతూ ఉంటే జిల్లా ప్రజలు నవ్వుకుంటున్నారు అనీ వ్యంగ్యాస్త్రాలు రామ్ కుమార్ రెడ్డి గుప్పించారు.ప్రజలను రెచ్చగొట్టి జిల్లాల పునర్విభజన పై తప్పుడు ఆరోపణలు చేస్తే అందుకు తగిన గుణపాఠం ప్రజలే చెబుతారు అనీ హెచ్చరించారు.ఆనం అంటే ద్రోహానికి కేరాఫ్ అడ్రెస్ అన్నారు.
ఆనం మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు..
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చెప్పే పిట్ట కథలు, కాకమ్మ కబుర్లు నమ్మే పరిస్థితులల్లో వెంకటగిరి ప్రజలతో పాటు, నెల్లూరు జిల్లాలోని ప్రజలు లేరు అనీ రామ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆనం కు పిచ్చి బట్టి చనిపోయిన వ్యక్తి పై ఆరోపణలు చేయడం,రాపూరు, కలువయి ప్రజలు శ్రీ బాలాజీ జిల్లాలో కొనసాగుతూము అంటూ ఉంటే ఈయన ఏమో కొంగ దీక్షలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం చూస్తూ వుంటే ఆయనకు ఆయనే రాజకీయ సమాధి చేసుకుంటున్నారు అనీ రామ్ కుమార్ ఎద్దవా చేశారు.ఇంకానైన మార్పు చెంది ప్రజల అభీష్టం మేరకు రాజకీయాలు చేసుకోవాలి అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మేరిగా మురళీధర్, వైసీపీ నేతలు కొడవలూరు భక్తవత్సల రెడ్డి,రాష్ట్ర సాంస్కృతిక అకాడమీ చైర్ పర్సన్ పోటెళ్ల శిరీష, దేవారెడ్డి నాగుర్ రెడ్డి, కల్లూరు భాస్కర్ రెడ్డి, వాకాడు జడ్పీటీసీ రౌతు రామకృష్ణ, వేమారెడ్డి షనీల్ రెడ్డి, పెంచలరెడ్డి,ఉదయ్ కుమార్,శ్రీనాధ్, మురళి, కృష్ణ చైతన్య,వెంకటేశ్వర్ల రెడ్డి,రాజా శేఖర్ రెడ్డి,రవి,వెంకట్, గోపాల్ వైసీపీ నేతలు, కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులు తదితరులు పాల్గున్నారు.
Comments are closed.