The South9
The news is by your side.
after image

అభివృద్ధిపై 30 ఏళ్ళ లక్ష్యంతో ముఖ్యమంత్రి అడుగులు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

01-01-2022,

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.

అభివృద్ధిపై 30 ఏళ్ళ లక్ష్యంతో ముఖ్యమంత్రి అడుగులు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

కొత్త సంవత్సరంలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపుతో అవ్వ,తాతల ఆశీర్వాదం

అధికారంలోకి రాగానే ప్రమాణస్వీకారం సందర్భంగానూ పింఛన్ పైనే సీఎం జగన్ తొలి సంతకం

ఇచ్చిన మాటను తప్పకుండా హామీలను అమలు చేయడంలో దేశానికే ఏపీ సీఎం రోల్ మోడల్

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, జనవరి, 01: ఇచ్చిన ప్రతి హామీని అంచెలంచెలుగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అభివృద్ధిపై 30 ఏళ్ళ లక్ష్యంతో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపుపై ముఖ్యమంత్రి నిర్వహించిన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లోని తిక్కన భవన్ నుంచి మంత్రి మేకపాటి వర్చువల్ గా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కష్టకాలం, క్లిష్ట పరిస్థితుల మధ్య ఉన్నా, ఎవరెన్ని మాటలన్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం పని చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మేనిఫెస్టోను ఖురాన్,బైబిల్, భగవద్గీతలుగా భావించి వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపును 2022 కొత్త ఏడాది సందర్భంగా ప్రారంభించి అవ్వ,తాతల మోములో చిరునవ్వుల పువ్వులు పూయిస్తున్నారన్నారు. నవరత్నాల ద్వారా సంక్షేమం, సంస్కరణలు, సరైన నిర్ణయాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సీఎం జగన్ మరింత ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఏ పని చేయలేని వృద్ధులకు సామాజిక బాధ్యత పింఛన్ ఇవ్వడం , ఆ మొత్తాన్ని పెంచడం వల్ల వారికి అండగా నిలవడంతో పాటు, ప్రజాప్రతినిధులైన మాలాంటి వారికీ గౌరవం అభిస్తోందన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా తరపున ముఖ్యమంత్రికి మంత్రి మేకపాటి ధన్యవాదాలు తెలిపారు.

Post midle

సంక్షేమం ఆగదు..పరిశ్రమల ప్రవాహం తప్పదు

ఆత్మకూరులో పెరిగిన పింఛన్ ను అందజేసిన మంత్రి గౌతమ్ రెడ్డి

వితంతు మహిళలు, వికలాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, వృద్ధులు కూడా ఎవరిపై ఆధారపడని విధంగా పింఛన్ల పంపిణీ

Post Inner vinod found

వాలంటీర్ల ద్వారా నేరుగా ప్రతి నెలా ఇంటికే పింఛన్లు అందించడం ఓ మలుపు

గతంలో ఎన్నడూ ఇవ్వనంత మందికి పింఛన్లు అందించే ప్రభుత్వం మనదే

పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి చలించి వాటిని తొలగించాలన్న తపనతో నవరత్నాలను తీసుకువచ్చారు

నెలకు రూ.1570కోట్లు, ఏడాదికి రూ.20వేల కోట్లు పింఛన్ల పంపిణీకే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది

రాష్ట్రంలో 60 లక్షల మందికి పింఛన్లు, ప్రతి ఒక్కరి బాధ్యతను తానే తీసుకునేంతలా మొత్తంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ

అవ్వతాతల బాగోగులను సీఎం చూసుకుంటారు…మీ మనుమలు, మనుమరాళ్ల భవిష్యత్ గురించి నేను చూసుకుంటా

రూ.25 కోట్లతో నారంపేట ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు అభివృద్ధి

ఆత్మకూరు నియోజకవర్గంలోని నారంపేటలో పరిశ్రమలను క్యూ కట్టిస్తాం

ఆత్మకూరు పట్టణం ఆర్డిఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ పింఛన్ కానుక కార్యక్రమంలో మంత్రి మేకపాటి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు ఆర్డిఓ చైత్రవర్షిణి, ఎంపిపి వేణుగోపాల్ రెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్లు, పట్టణ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, అధికారులు

Post midle

Comments are closed.