రేపు తీర్పుతో తేలనున్న పెద్ద సినిమాల భవిత్యం
ఆంధ్రాలో లో సినిమా టికెట్ల రేట్లు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. కోర్టు ఇచ్చిన తీర్పులో సినిమా టికెట్ల పెంపుదల జీవో 35 ను కొట్టివేసిన, ప్రభుత్వం ఎందుకనోఈ విషయాన్ని వదిలేటట్లు కనిపించడం లేదు. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది ప్రభుత్వం.
ఇలా అయితే థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ల రేట్లు ని అమాంతంగా పెంచేస్తారు అని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ న్యాయవాది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి రేపు మొదటి కేసు గా తీసుకుని విచారిస్తామని సమాధానం ఇచ్చారు. రేపు వచ్చే డివిజన్ బెంచ్ తీర్పుపై ఆధారపడి ఉంటుంది ఈ వ్యవహారం.
17న అల్లు అర్జున్ పుష్ప తో పాటు పెద్ద సినిమాలు రిలీజ్ కి దగ్గర లో ఉండడంతో అందరూ ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ప్రభుత్వం తెచ్చిన 35 జీవో ని ఎవరు సరిగా అమలు చేయలేదు అనేది జగమెరిగిన సత్యం. ఈ జీవోను బూచిగా చూపి కొంతమంది ఉన్నత అధికారులు సినిమా థియేటర్ల యాజమాన్యాల దగ్గర ముడుపులు తీసుకున్నారని దానికి కిందిస్థాయి ఉద్యోగులు వీరికి సహకరించారనే ఆరోపణలు గతంలోనే గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోకుండా ఉంటే బాగుండేదని విశ్లేషకులు అంటున్నారు.
Comments are closed.