ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వృద్ధాప్య పింఛన్ల దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలో భాగంగా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వృద్ధాప్య పెన్షన్ లని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతానని చెప్పిన ప్రకారం 2250 రూపాయలు ఉన్న పెన్షన్ ని అదనంగా రెండు వందల యాభై రూపాయలు పెంచడంతో 2500 రూపాయలు కి చేరింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సర కానుకగా వృద్ధులకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన గిఫ్ట్ గా భావిస్తున్నారు . ఎన్నికల హామీలో భాగంగా దాదాపుగా మేనిఫెస్టో లో ఉన్న ప్రతి పథకాన్ని అమలు చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వృద్ధాప్య పెన్షన్ పెంచడంతో , ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ప్రభుత్వం తమదేనని వైయస్సార్ పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు.
Comments are closed.