The South9
The news is by your side.
after image

బాలయ్య బాబు ఎనర్జీ వల్ల ” జై బాలయ్య “సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది . డాన్స్ మాస్టర్ భాను

తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులు దేశవిదేశాల్లో ఎక్కడ ఉన్నా ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక మాట… “అఖండ”…. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దూసుకుపోతుంది . ఈ నేపథ్యంలో ముఖ్యంగా చిత్రంలోని ఒకే ఒక పాట అయిన జై బాలయ్య… పాట బాలయ్య అభిమానుల తో పాటు చిన్న పెద్ద మహిళ అని తేడా లేకుండా…. థియేటర్లో బయట అందరి చేత స్టెప్పులు వేసేలా చేసింది.. ఈ పాటకి నృత్య దర్శకత్వం వహించి అందర్నీ అలరించి …. డ్యాన్స్ రాని వారు కూడా… డాన్స్ వేసేలా చేసిన నృత్యదర్శకుడు ….    “భాను మాస్టర్“… ఈ జనరేషన్ హీరోలతో పోటీ పడే విధంగా బాలయ్య బాబు తో స్టెప్పులు వేయించిన భాను మాస్టర్. తో ‘ద సౌత్ 9′ ముచ్చట్లు

Post Inner vinod found
  • దర్శకులు చెప్పినట్టు ముందుకు వెళ్లాలి
  • మనం ఏదో రుద్దాలి అనుకోవడం తప్పు
  • పుష్ప ఐటమ్ సాంగ్ చేస్తున్నాను
  • అందరిహీరోలత కలిసిపనిచేయాలని ఉంది                                                                                     నేపథ్యం….                                                                                                                                                                                                             2002లో నగరానికి సరదాగా సెలవులకు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళాలని అనుకున్నాను. ఆ సమయంలో కొన్ని ఈవెంట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా డాన్స్ మాస్టర్ అవ్వాలని రాలేదు కానీ యాదృచ్చికంగా డాన్సర్ గా డాన్స్ మాస్టర్ గా అవ్వడం జరిగింది. ముఖ్యంగా గణేష్ మాస్టర్ దగ్గర ఉండడం, ఆయనకు అసిస్టెంట్ గా చేయడంతో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాను.                                                                                                                                                                                   డాన్స్ మాస్టర్ గా గుర్తించింది ఎవరు  …..                                                                                         నేను గణేష్ మాస్టర్ నిక్సన్ మాస్టర్ ల ప్రభుదేవా మాస్టర్, ల దగ్గర అసిస్టెంట్ గా పని చేశాను. చాలా సందర్భాల్లో గణేష్ మాస్టర్ పాటలోని కొంత భాగాన్ని నాకు అప్ప చెప్పేవారు . అలా పనిచేస్తున్న సమయంలో నా పని తీరు చూసి డాన్స్ మాస్టర్ గా నువ్వు కూడా ప్రయత్నించు నువ్వు చేయగలుగుతావు అని చెప్పింది మాత్రం గణేష్ మాస్టర్.                                                                                                                                                                                                                                                                                                          మొదటి అవకాశం.….                                                                                                             ముందుగా సాయిధరమ్ తేజ్ హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ అనే సినిమాకి అవకాశం వచ్చింది. నాతోపాటు మా టీం సభ్యులు 40 రోజులుగా అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన రిహార్సల్స్ లో కూడా పాల్గొన్నాము. ఆ సందర్భంలో సాయి ధరమ్ తేజ్ కి చిన్న పాటి గాయం కావడంతో తిరిగి రావడం జరిగింది. తర్వాత సునీల్ హీరోగా పూలరంగడు చిత్రంలో మొదటిగా అవకాశం రావడం ఆ చిత్రంలో రెండు పాటలకి అవకాశం రావడం అవి పెద్ద హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.                                                                                                                                                      ఇప్పటి వరకు చేసిన పాటలుదాదాపుగా                                                                                        200కు పైగా నృత్య దర్శకత్వం వహించాను. అందరి హీరోలతో కలిసి పనిచేశాను. రాజా ది గ్రేట్ లో రవితేజ తో, రామయ్యా వస్తావయ్యా , ఎన్టీఆర్ తో సరైనోడు చిత్రం లో అల్లు అర్జున్ తో గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ తో సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబుతో ఎఫ్ 2 వెంకటేష్ వరుణ్ తేజ్ తో ఇస్మార్ట్ శంకర్ రామ్ తో కలిసి పని చేశాను. అందరూ దర్శకులు నాకు అవకాశం కల్పిస్తున్నారు, అలానేఅందరు హీరోలు స్నేహ పూర్వక వాతావరణంతో నన్ను ప్రోత్సహించడం ద్వారా ఇలా ముందుకు వెళుతున్నాను.                                                                                                                                         డాన్స్ కంపోజింగ్ లో దర్శకుల ఇన్వాల్వ్మెంట్ పై మీ అభిప్రాయం.
    డైరెక్టర్లు చెప్పినట్లు మేము చేయడమే ఇక్కడ ముఖ్యం. వారు మాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. కథలో భాగంగా చెప్పిన ప్రకారం చేసుకుంటూ వెళ్లాలి. మాది ఏదో రుద్దాలి అనుకుంటే మాత్రం బోల్తా పడక తప్పదు. హీరోల తాలూక ఇమేజ్ వారి బాడీ లాంగ్వేజ్ పాటలో ట్రావెల్ అయ్యే విధానాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా కంపోజ్ చేయడమే చెయ్యాలి. నేను పనిచేసిన దర్శకులు అనిల్ రావిపూడి, బోయపాటి ,పూరి జగన్నాథ్, అందరూ దర్శకులు స్వేచ్ఛ ఇవ్వబట్టే సాంగ్స్ అన్ని హిట్ అవ్వడం జరిగింది. వీరితో పాటు హీరోల సహకారం మరువలేనిది     

                                                                                                                                                      అఖండ అవకాశం ఎలా వచ్చింది?                                                                                                         గతంలోనే దర్శకులు బోయపాటి దర్శకత్వంలో సరైనోడు చిత్రానికి పని చేయడం జరిగింది. అఖండ చిత్రానికి సంబంధించి దర్శకులు నన్ను పిలిపించి ఈ చిత్రం లో ఉండేది ఒకే ఒక సాంగ్ అది బాలయ్య బాబు అభిమానులు ఉర్రూతలూగించే విధంగా ఉండాలని చెప్పారు. దానికి తగ్గట్టుగా బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో ఉంచుకొని చేయడం జరిగింది ఆ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్రెడిట్ దర్శకులు బోయపాటి హీరో బాలయ్య బాబు కి ఎక్కువ శాతం చెందుతోంది.                                                                                                                                         ప్రస్తుత ప్రాజెక్టులు……                                                                                                                    ఎఫ్ త్రీ లో 2 సాంగ్స్ చేస్తున్నాను అల్లు అర్జున్ పుష్పాలో ఐటమ్ సాంగ్ దాంట్లో సమంత నటిస్తున్నారు. ఇలా బిజీగా ఉన్నాను.                                                                                                                                              ఎవరెవరితో చేయాలని ఉంది                                                                                                                అందరి హీరోలతో చేయాలని ఉంటుంది రామ్ చరణ్ గారి తో చేయలేదు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో చేయలేదు ప్రభాస్ గారితో చేయలేదు వారందరితో వర్క్ చేయాలనే ఉంది. త్వరలో వీరందరితో చేయాలని మేము కూడా మనస్పూర్తిగా ఆశిస్తూ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు – ఎడిటర్

 

Post midle

Comments are closed.