The South9
The news is by your side.
after image

టాలీవుడ్ కి జగన్ గిఫ్ట్.

టాలీవుడ్ లో సినిమా టికెట్లను ఆన్లైన్ విధానం ద్వారా అమలు చేయాలని ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం జీవో తీసుకురావడంతో టాలీవుడ్ పరిశ్రమ పెద్దలు లోలోపల మదన పడుతున్నారు. పైకి గుంభనంగా ఉన్న దీని వల్ల ఎలాంటి నష్టం ఉంటుంది అనేది పరిశ్రమలోని వారందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ నే టికెట్లు రేట్లు పెంచాలని ప్రభుత్వానికి తెలియపరిచారు. దీనికి ప్రతిస్పందనగా రాష్ట్ర సమాచార మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినఅప్పుడు నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కరోనా సమయంలో తూతూ మంత్రంగా కలవడమే కానీ , ఎప్పుడు తెలుగు సినీ పరిశ్రమ కి సంబంధించిన విషయాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లడం, పరిశ్రమ వర్గాలు ముఖ్యమంత్రిగా ఒక్కసారైనా మర్యాదపూర్వకంగా సన్మానం చేయకపోవడం కొంత వ్యతిరేకత చోటు చేసుకుంది. తెలంగాణ లో కెసిఆర్ ని కీర్తించడం వంటి చర్యలను గమనిస్తూనే ఉన్నా రాజకీయ పక్షాలు, సినీ పరిశ్రమ కి చెందిన ఒక వర్గం ఈ చర్యతో టాలీవుడ్ కి జగన్ ఝలక్ ఇచ్చాడని అంటున్నారు

Post Inner vinod found

Post midle

Comments are closed.