గిరిజన ఆదివాసీల సంక్షేమం కొరకు కోటి రూపాయలు విరాళాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి అందజేసిన హీరో సూర్య.
చెన్నై ప్రతినిధి: ప్రముఖ దక్షిణాది సూపర్ స్టార్ సూర్య తన పెద్ద మనసుని మరోసారి చాటుకున్నారు. 2006 న అగరం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, చదువుకు దూరంగా ఉంటున్న రూరల్ ప్రాంతపు ప్రజల కోసం అగరంఫౌండేషన్ ద్వారా ఎన్నో వేల మంది పేద విద్యార్థులను చదివిస్తున్న సూర్య తాజాగా తన సొంత నిర్మాణ సారథ్యంలో ఐదు భాషలలో “జై భీమ్” అనే చిత్రాన్ని నిర్మించారు. ఒక గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించే లాయర్ పాత్రలో సూర్య ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో నేడు విడుదలయి అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని కుటుంబ సభ్యులతో కలిసి కోటి రూపాయల విరాళాన్ని గిరిజన ఆదివాసీల సంక్షేమం కొరకు పనిచేస్తున్న “పజన కూడి ఇరులార్” ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ సూర్య గొప్ప మనసు కలిగిన వ్యక్తి అని అభినందించారు. అలానే. ” జై భీమ్” లాంటి చిత్రాలు మరెన్నో రావాలని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
படம் எடுத்ததோடு நில்லாமல், பழங்குடியினர் பாதுகாப்புச் சங்கத்தின் மேம்பாட்டுக்கு ரூ.1 கோடி நிதியினை வழங்கிய நண்பர் @Suriya_offl அவர்களை எத்தனை பாராட்டினாலும் தகும்!
படக்குழுவினருக்குப் பாராட்டுகள்! வாழ்த்துகள்!#JaiBhim போன்ற படங்கள் இன்னும் ஏராளமாக வரவேண்டும்! pic.twitter.com/lF0FjySD5Y
— M.K.Stalin (@mkstalin) November 1, 2021
Comments are closed.