సినీ బ్యూరో: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు జరిగిన జాతీయస్థాయి అవార్డు ల స్వీకరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా సినిమా రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ ఈ అవార్డు తీసుకుంటున్న సమయంలో నా గురువు దర్శక దిగ్గజం కె.బాలచందర్ లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. అలానే తన అన్న సత్యనారాయణ గైక్వాడ్ గురించి మాట్లాడుతూ తన ప్రయాణంలో వెన్నంటి నిలిచిన అన్న గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అలానే కర్ణాటకలో తన కండక్టర్ పని చేస్తున్నప్పుడు తనలోని నటుడిని గుర్తించి యాక్టింగ్ స్కూల్ తనను పంపించిన తన
?I dedicate my award to… https://t.co/XxOaI82k4C
— Rajinikanth (@rajinikanth) October 25, 2021
సహచర మిత్రుడు డ్రైవర్ రాజ బహుదూర్ గురించి మాట్లాడుతూ తన అవార్డుని ఆయనకు డెడికేట్ చేస్తున్నట్లు తెలియపరిచారు. తనతో సినిమాలు తీసిన నిర్మాతలకు దర్శకులు కు, సహచర నటీనటులకు మీడియాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
Comments are closed.