ఢిల్లీ ప్రతినిధి : ఉత్తరప్రదేశ్ లో ని లఖీమ్ పూర్ లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ర్యాలీ పై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కాన్వాయ్ తొక్కించడం పై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ నిన్న జరిగిన దుర్ఘటన తో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో రౌడీ రాజ్యం నడుస్తోందని, దేశంలో నియంత పాలన సాగుతోందని బీజేపీ పై విరుచుకుపడ్డారు. రైతులను తొక్కించిన వాహనంలో కేంద్ర మంత్రి కుమారుడు ఉన్నాడు అని తెలిసిన ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలానే లఖింపూర్ కి వెళ్లి బాధితులను పరామర్శిస్తానని తెలిపారు. ముగ్గురు తోనే వెళతానని దీనికి 144 సెక్షన్ వర్తించదని ముందుగానే ప్రభుత్వానికి తెలియపరిచారు. నిన్న జరిగిన సంఘటన తో కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పక్షాలన్నీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచాయి. ఘటనకు కారణమైన మంత్రి కుమారుడు అజయ్ మిశ్రా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments are closed.