నిన్న జరిగిన రిపబ్లిక్ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ కి సంబంధించి న పలు విషయాల్ని ప్రశ్నించారు. ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమ పెద్దలు, ఆంధ్ర రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని కలవడంపై వ్యంగ్యంగా విమర్శించారు. ఏకవచనంతో సన్నాసి అని సంబోధించడం పై రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అలానే సినిమా థియేటర్ల లో టికెట్లను ఆన్లైన్లో ప్రభుత్వం అమ్మాలనే నిర్ణయంపై పవన్ కళ్యాణ్ విలక్షణ నటుడు మోహన్ బాబు పై కొన్ని ప్రశ్నలు వేశారు. వై.ఎస్.ఆర్ కుటుంబానికి మీరు బంధువు అని చెప్పుకుంటారు కదా ఈ విషయాలపై స్పందించాలని మోహన్ బాబు ను కోరారు. దీనికి ప్రతిగా నటుడు మోహన్ బాబు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు…… దాని సారాంశం…………
నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంబోధించాను.
పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమిలేదు.
చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్, సంతోషమే.
ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి.
నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే.
అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి.
ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను.
ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని…
నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్ కి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్యూ వెరీమచ్..
మోహన్ బాబు
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021
Comments are closed.