నేను నా కార్యకర్త కార్యక్రమంలో .. మనపాటి కుటుంబంతో ప్రజా నాయకుడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నెల్లూరు : నెల్లూరు జిల్లా లోని నెల్లూరు రూరల్ వై ఎస్ ఆర్ సి పి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టిన వినూత్నంగా ఉంటుంది. గతంలో కూడా గడప గడపకి వైయస్సార్ సిపి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి నియోజకవర్గం అంతా తిరిగిన నేతగా పేరు పొందారు. తర్వాత దాని విశిష్టతను గుర్తించిన ఆ పార్టీ అధినాయకుడు , ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులు అందరికీ గడపగడపకు వైఎస్సార్సీపీ అనే కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పిన నేపథ్యం ఉంది. అయితే మరల మరొక విభిన్న ఆలోచనతో నేను నా కార్యకర్త అనే కార్యక్రమానికి .శ్రీకారం చుట్టి గత ఎనిమిది రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకోవడం ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ రోజు నెల్లూరు రూరల్ లోని 22 వ డివిజన్ పరిధిలో ని సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనపాటి సాల్మన్ ఇంటిని సందర్శించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. సాల్మన్ అన్న తో 30 ఏళ్ళ పైగా అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. అలానే కార్యక్రమం గురించి తెలియ పరుస్తూ సుమారు 4 వేల మందిని ప్రత్యక్షంగా కలిసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలియపరిచారు. సందర్భంగా మన పాటి సాల్మన్ కుమారులు,
సౌత్ 9 ఎడిటర్ మన పాటి చక్రవర్తి, వారి అన్నలు మన పాటి విజయ్ కుమార్, మనపాటి అనిల్ దుశ్శాలువతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ మూలె విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు దైవాధీనం, మైనార్టీ నాయకులు షంషుద్దీన్, సురేష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.