ముంబై :. కరోనా సమయంలో సామాన్య ప్రజలకు విశేష సేవలు అందించి అందరి దృష్టిలో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ పై గత మూడు రోజుల గా ఐటీ దాడులు జరుగుతుండడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత రెండు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు పన్ను ఎగవేతకు సంబంధించి ముంబైలోని సోను సూద్ నివాసం, కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ తో జరిగిన ఒక ఒప్పందం, అలానే మిగతా లావాదేవీలు ను క్షుణ్ణంగా. పరిశీలిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలవడం ఆ పార్టీ తరపున దేశ్ కా మెంటర్ గా సోనూసూద్ ని నియమించడం, తదుపరి ఐటి దాడులు జరగడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. గతంలో కూడా సోనూసూద్ వెనక మహారాష్ట్ర నేత శరత్ పవర్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఐటీ దాడుల వెనక కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
Comments are closed.