The South9
The news is by your side.
after image

ఎగుమతుల్లో అగ్రస్థానమే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవ్ -2021 : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 

అమరావతి.

*ఎగుమతుల్లో అగ్రస్థానమే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవ్ -2021 : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*

*2030 కల్లా రెట్టింపు ఎగుమతులు*

*ముఖ్యమంత్రి చేతులమీదుగా మంగళవారం వాణిజ్య ఉత్సవ్ -2021 లాంచ్*

*రాష్ట్ర ప్రభుత్వం , ప్లాస్టిక్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎక్స్ పోర్ట్ సమ్మిట్*

*రెండు రోజుల సదస్సుకి హాజరుకానున్న దేశ,విదేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, పాలసీ తయారీదారులు, ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్*

Post midle

*వాణిజ్య ఉత్సవం-2021 కర్టెన్ రేజర్ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు*

Post Inner vinod found

*వాణిజ్య ఉత్సవ్ లోగోను ఆవిష్కరించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి*

*వాణిజ్య ఉత్సవ్ కి సంబంధించిన ఫ్లైయర్ లాంచ్ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు*

*ఎక్స్ పోర్ట్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వెబ్ పేజీని ప్రారంభించిన ఇరువురు మంత్రులు*

అమరావతి, సెప్టెంబర్, 16 : ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టడమే లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 2030 కల్లా రెట్టింపు ఎగుమతులు సాధించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య ఉత్సవ్ -2021 నిర్వహించేందుకు సిద్ధమైనట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు వాణిజ్య ఉత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనుందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.
వాణిజ్య ఉత్సవం-2021 కర్టెన్ రేజర్ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుతో కలిసి పాల్గొన్నారు. రెండు రోజుల సదస్సుకి దేశ,విదేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, పాలసీ తయారీదారులు, ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ హాజరవుతున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం , ప్లాస్టిక్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ఎక్స్ పోర్ట్ సమ్మిట్ నిర్వహించనుందన్నారు.

మంత్రి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్ర,శని,ఆది వారాలలో ఏదైనా రెండు రోజులలో జిల్లా స్థాయిలో కలెక్టర్లు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వాణిజ్య ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. ఉత్పత్తులపై దృష్టి సారించి తద్వారా ఎగుమతులను మరింత ప్రోత్సహించడమే వాణిజ్య ఉత్సవం లక్ష్యమన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెద్ద ఎత్తున ఆకర్షించడం, విదేశీ రాయబారులతో వరుస సమావేశాలు, ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి మరింత అండదండ, రాబోయే పెట్టుబడిదారులు, ఎగుమతిదారుల కోసం ఎక్స్ పీరియన్స్ సెంటర్, పారిశ్రామిక, ఎగుమతిదారులలో సత్తా చాటిన వారిని గుర్తించి అవార్డులు అందించి ప్రోత్సహించడం, IEC (ఐఈసీ) రిజిస్ట్రేషన్లను స్పాట్ లో చేసేలా సులభతరం చేయడం వాణిజ్య ఉత్సవం ముఖ్యోద్దేశమని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి వాణిజ్య ఉత్సవ్ కి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఈవెంట్ కి సంబంధించిన ఫ్లైయర్ ను లాంచ్ చేశారు. వాణిజ్య ఉత్సవంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఇరువురు కలిసి వెబ్ పేజ్ పి లాంచ్ చేశారు. ఇదే దాని లింక్ : *http://apindustries.gov.in/vanijyautsavam/*;ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21,22 తేదీలలో నిర్వహించబోయే వాణిజ్య ఉత్సవం-2021 ఉద్దేశ్యాన్ని చాటే ప్రెజెంటేషన్ ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియా ముఖంగా వివరించారు.

2019-20 సంవత్సరానికిగానూ ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల ర్యాంకింగ్ 7వ స్థానం ఉందని మంత్రి మేకపాటి తెలిపారు. అయితే 2020-21 ఏడాదిలో ఎగుమతుల ర్యాంకింగ్స్ లో మూడు స్థానాలు ఎగబాకి ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచిందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. 2020-21 ఏడాదికిగానూ దేశ ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ వాటా 5.8 శాతం ఉన్న నేపథ్యంలో 2030 కల్లా 10% ఎగుమతులను సాధించడమే ఎక్స్ పోర్ట్స్ సమ్మిట్ లక్ష్యమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. 2020-21లో 16.8 బిలియన్ యూఎస్ డాలర్ల ఎగుమతులు జరిగినట్లు మంత్రి మేకపాటి వివరించారు. 2029-30 కల్లా రెట్టింపు ఎగుమతులు (33.7శాతం) సాధించే దిశగా
ఏపీ అడుగులు వేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎగుమతులలో కీలక ఉత్పత్తుల వాటాలో సముద్ర ఉత్పత్తులు 15 శాతం, షిప్, బోటు స్ట్రక్చర్ 8.4శాతం, ఔషధాలు 7.3 శాతం, ఐరన్, స్టీల్ 7.4 శాతం, బియ్యం 4.6 శాతం, అవశేష రసాయనాలు 3.6 శాతం
ఉందని ప్రజంటేషన్ లో పేర్కొన్నారు. ఎగుమతుల ప్రమోషన్ లో భాగంగా ఎగుమతుల పాలసీ, ఎక్స్ పోర్ట్ హబ్ లు, రాయబారులతో భాగస్వామ్యమై దిగుమతిదారులను గుర్తించి మార్కెటింగ్ పెంచడం, ఎగుమతులను సరళతరం చేయడం, సరకు రవాణాకు తగిన మౌలిక వసతులను పెంచడం, నైపుణ్యం, శిక్షణను నేర్పి, అలవరచడం ఇలా అనేక వ్యూహాలను సిద్ధం చేశామని మంత్రి మేకపాటి వివరించారు.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా తొలిరోజు వాణిజ్య ఉత్సవం ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఈ సందర్భంగా వివరించారు.

వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో జరిగిన వాణిజ్య ఉత్సవం-2021 కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ లో ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి, ఎమ్ఎస్ఎమ్ఈ ఛైర్మన్ వంకా రవీంద్ర నాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది తదితరులు పాల్గొన్నారు.

Post midle

Comments are closed.