The South9
The news is by your side.
after image

నెల్లూరులో మహిళని విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా :

గంటల వ్యవధిలో మహిళను కొట్టి పరారీలో ఉన్న ముద్దాయిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

Ø మహిళా భద్రత మరియు రక్షణకు పెద్ద పీట వేసిన నెల్లూరు పోలీసులు

Ø ఫిర్యాదుతో సంబంధం లేకుండా తక్షణం స్పందించి, నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించిన జిల్లా యస్.పి.

Ø జిల్లా యస్.పి. గారు మూడు బృందాలను ఏర్పాటు చేసి, గంటల వ్యవధిలోనే ముద్దాయి అరెస్ట్

Ø సహకరించిన మీడియా మిత్రులు, కేసును చేధించిన పోలీసు అధికారులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా యస్.పి.

Post Inner vinod found

ఈరోజు SPS నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన. ఒక సోదరిపై నిందితుడు చేసిన దాడిని సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మాద్యమాల ద్వారా మా దృష్టికి వచ్చిన వెంటనే టౌన్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్  శ్రీనివాసరెడ్డి మరియు SHO వేదాయపాలెం రామ కృష్ణ ను అలెర్ట్ చేయడం జరిగింది. జిల్లా యస్.పి.  విజయరావు,ఐ.పి.ఎస్.,  వెంటనే A,B,C అనే మూడు బృందాలను ఏర్పాటు చేసారు. మొదటగా వీడియోలోని వ్యక్తులను పోలీసు మరియు మీడియా మిత్రుల సహకారంతో నిందితుడిని, బాధితురాలిని గుర్తించడం జరిగింది. ఆ బృందాలలో మొదటి బృందంను రాపూరు, కలువాయి నకు, రెండో బృందంను సోమశిలకు, మూడో బృందంను రామకోటయ్యనగర్ కు పంపడం జరిగింది.

Post midle

వివరాల్లోకి వెళితే…. నిందితుడు మరియు బాధితురాలు కొంతకాలంగా స్నేహంగా ఉండేవారు. అతని వ్యవహారం నచ్చక స్నేహం చేయడం మానేసింది. దాన్ని మనసులో పెట్టుకొని మూడు నెలల క్రితం ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్లి, వీడియో లో చూసిన విధంగా కర్రతో సుమారు 13 సార్లు పైగా కొట్టడం, సెల్ ఫోన్ లో రికార్డు చేయడం, దానిని అతని సహచరుల సహకారంతో సర్క్యులేట్ చేయడం జరిగింది.

నిందితుడికి గతంలో పెళ్లై భార్య కూడా విడిచిపెట్టడం జరిగింది. ఈ విషయం జరిగినప్పటికీ పోలీసుల దృష్టికి గానీ, కంప్లైంట్ ఇవ్వడం గానీ జరగలేదు.

ఈరోజు జిల్లా యస్.పి. విజయ రావు,IPS., దృష్టికి వచ్చిన తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది. ముద్దాయిని మరియు అతని సహచరులను కూడా అరెస్టు చేయడం జరిగింది. నిందితుని చట్టప్రకారం కఠినాతికఠినంగా శిక్షించడం జరుగుతుంది. అదేవిధంగా అతని మీద రౌడీషీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. 7 రోజులలోపు చార్జ్ షీట్ వేయబడును. కంప్లైంట్ ఇవ్వనప్పటికీ పోలీసు శాఖ దీన్ని కాగ్నిజెన్స్ కేసుగా నమోదు చేయడం జరిగింది.

మహిళలపైన ఎంత గౌరవం ఉన్నది. మహిళా భద్రతకు నెల్లూరు పోలీసులు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నది మరియు వారి పట్ల ఎంత గౌరవం ఉన్నది ఈ చర్యల ద్వారా తెలుస్తున్నది.

అందురూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే……. మహిళల యొక్క గౌరవానికి సంబంధించిన విషయంలో ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడకుండా, వారి గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడాలని పత్రికాముఖంగా నెల్లూరు పోలీసులు తెలియజేస్తున్నాము.

నిందితులపైన Cr.No.298/2021 U/s 363, 341, 324, 354(A), 506, 509 r/w 34 IPC and 67 (A) IT ACT సెక్షన్ల కింద వేదయపాలెం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడిని రిమాండ్ చేసిన అనంతరం రౌడీ సీటు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.

 

Post midle

Comments are closed.