తెలంగాణ : తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. కరోనా మూడో దశ ముప్పు ఉందన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు బాలకృష్ణ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ప్రారంభించాలని తలపెట్టిన జీవోపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేయగా, దానిని విచారించ న హైకోర్టు వారం పాటు పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయం పై స్టే విధించింది. పాఠశాలలు, హాస్టల్లో ఏ ,ఏ జాగ్రత్తలు తీసుకున్నారు అనేది తెలియపరచాలని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. పిల్లలను స్కూల్ కి పంపే విషయంలో తల్లిదండ్రుల సూచనలు తీసుకోవాలని తెలిపింది. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించాలని , వారం రోజులు తర్వాత తెలంగాణ ప్రభుత్వం రూపొందించబోయే మార్గదర్శకాలనీ తెలపాలని, అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఏ విధమైనటువంటి కౌంటర్ దాఖలు చేస్తోందో దానిపై పూర్తిస్థాయి తీర్పు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments are closed.