అమరావతి : కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియకముందే కరోనా తాడ్ వేవ్ వస్తుందనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు సూచనలతో అప్రమత్తమైంది రాష్ట్రప్రభుత్వం. ఆంధ్రాలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ ని యధావిధిగా కొనసాగిస్తూనే కేసులు పెరుగుతున్న దగ్గర కంటైన్మెంట్ జోన్లు ను విధిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు ,పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు హాట్ స్పాట్ లుగా మారాయి. దీంతో అక్కడ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుంది అధికార యంత్రాంగం. గుంటూరు జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాలలో కర్ఫ్యూ కొనసాగుతోంది. అలానే గుంటూరు నగరంలోని బ్రాడీపేట ను కంటైనర్ కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించడంతో పాటు మధ్యాహ్నం వరకే వ్యాపార లావాదేవీలు కు అవకాశం ఇచ్చారు. ఇక నెల్లూరు జిల్లాలోని కావలి వింజమూరు విడవలూరు ప్రాంతాల్లో కఠినంగా నిబంధనలు కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీకెండ్ లాక్ డౌన్ తో పాటు, ఆదివారం ఉదయం పది గంటల వరకే వ్యాపార లావాదేవీలు అవకాశం ఇస్తూ తరువాత కర్ఫ్యూ ని కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో ప్రజలు విచ్చలవిడిగా తిరగడంతో పాటు సభలు ,సమావేశాలు, నిర్వహిస్తూ, ఉండడంతో. లాక్ డౌన్ వైపే అధికారులు మొగ్గు చూపుతున్నారని సమాచారం.
Comments are closed.