ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా నీలి చిత్రాల వ్యవహారంలో గత నెల 19న ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విచారణలో భాగంగా శిల్పాశెట్టి ని కూడా ముంబై పోలీసులు విచారించడం, వాటిపై మీడియాలో రావడం తో, శిల్పా శెట్టి ముంబై హైకోర్టు లో మీడియా సంస్థల పై పరువునష్టం దావా వేయగా ఆ పిటిషన్ ని హైకోర్టు తోసిపుచ్చింది. ఇది పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని, విచారణలో పోలీసులతో మీరు సంభాషించిన విషయాలే ప్రచురించడం జరిగిందని హైకోర్టు వ్యాఖ్యానించడంతో శిల్పా శెట్టి కంగుతిన్నారు. ఇది ఇలా ఉండగా ఈ వ్యవహారంతో తన మనసు కలత చెందింది అని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
My statement. pic.twitter.com/AAHb2STNNh
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) August 2, 2021
శిల్ప మాట్లాడుతూ..గత కొన్నిరోజలుగా నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. రాజ్‌కుంద్రా అరెస్ట్ వ్యవహరంపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మీడియాతోపాటు అయినవాళ్లు కూడా నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకూ నేను అస్సలు మాట్లాడలేదు. ప్రస్తుతం కేసు విచారణలో దశలో ఉన్న కారణంగా ఆ విషయంపై నేను మాట్లాడాలని భావించడం లేదు. ముంబయి పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక తల్లిగా నా పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి నా గురించి అసత్య ప్రచారాలు చేయకండి…. అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచారు.
Comments are closed.