కింగ్ ఫిషర్ మాజీ యజమాని వ్యాపారవేత్త, విజయ్ మాల్యా కి లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. భారతదేశంలో బ్యాంకులు వద్ద భారీగా రుణాలు తీసుకొని చెల్లించకుండా లండన్ కి పారిపోయిన విజయ్ మాల్యా కి అక్కడి కోర్టు దివాలా తీస్తున్నట్లు ప్రకటించింది.ఈ తీర్పు వలన భారత్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలుస్తుంది. దీని ద్వారా బ్యాంకులకు రావాల్సిన రుణాలు రాబట్టుకునేందుకు మార్గం సుగమం కానుంది. బ్రిటన్ చట్టాల ప్రకారం ఈ తీర్పు ఇస్తే దివాలా తీసిన వ్యక్తి ఆస్తులు అమ్మి వెంటనే దివాలా ట్రస్ట్ కి బదిలీ అవుతాయి. ఆస్తులు లెక్కగట్టడం, దివాళా తీసిన ఆస్తులు అమ్మి రుణదాతలకు చెల్లించడం వంటి వ్యవహారం ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తారు. ఈ విధంగా తిరిగి బ్యాంకులకు రావలసిన బకాయిలు జమ అయ్యే అవకాశాలు ఉన్నందున భారత్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు సంబంధించి విజయ్ మాల్యా దాదాపు తొమ్మిది వేల కోట్ల పైచిలుకు రుణాలు చెల్లించవలసిన విషయం విధితమే.
Comments are closed.