అమరావతి : తను నమ్ముకొన్న సిద్ధాంతం, అన్నిటికి మించి నీతి, నిజాయితి గా తన వృత్తి పట్ల నిబద్ధత గా పని చేస్తే , రిటైర్ అయిన తరువాత కూడా వారి సేవలని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అనే దానికి నిదర్శనం మాజీ ఐఏఎస్ బి. ఉదయలక్ష్మి అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. భర్త మాజీ ఐజి గా ప్రస్తుత సమాచార కమిషనర్ బి.వి.రమణకుమార్ అయినా ఏనాడు కుడా కించిత్తు గర్వం లేదుకదా .. తన ముందున్న కర్తవ్యాన్ని తోటి అధికార యంత్రాంగం ద్వారా సవ్యంగా నడిపించేవారు .
ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పనిచేసి రిటైర్డ్ అయిన బి. ఉదయలక్ష్మి ని రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ మెంబరు గా నియమించారు. ఆమె ఈ రోజు అథారిటీ మెంబర్ గా పదవి భాధ్యతలు చేపట్టి, మర్యాదపూర్వకముగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి , అథారిటీ చైర్మన్ మరియు రిటైర్డ్ హైకోర్టుజడ్జీ కనగరాజన్ ని కలిసారు.
ఈ సందర్భంగా బి. ఉదయలక్ష్మి మాట్లాడుతూ,గౌరవ సుప్రీంకోర్టుఆదేశాల మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. తాను రాష్ట్రంలోని పోలీసు అధికారుల పనితీరు బాగు చేయడానికి, కేసుల దర్యాప్తు ల లో పారదర్శకత్వానికి, ప్రజల పట్ల పోలీసులు భాద్యతాయుతంగా వుండటానికి తాను శాయ శక్తులా పని చేస్తాననిచెప్పారు..
ఇప్పటివరకు లాకప్ డెత్,చిన్న పిల్లల కిడ్నాప్, స్త్రీలపై అత్యాచారము జరిగినప్పుడు, కొంతమంది పోలీసు అధికారులు కొన్ని ఒత్తిళ్ళ వలన, కొంతమంది పలుకుబడివలన, చట్ట ప్రకారము చర్య తీసుకొనకపోతే హైకోర్టును ఆశ్రయించవలసి వస్తుందని, కోర్టుల్లో కేసులు ఎక్కువైపోవటం వలన, ఆ కేసులు ఆలస్యం అయిపోతుందని చెప్పినారు. ఇకపై అటువంటి పోలీసు అధికారులను తక్షణమే నియంత్రించుటకు, ప్రజలు పిర్యాదులు ఇవ్వగానే తమ అథారిటీ వెంటనే జ్యోక్యం చేసుకొని తగిన న్యాయం జరిగేల చూడటం జరుగుతుంది అని అన్నారు..
రాష్ట్ర పోలీస్ కంప్లైంటు అథారిటీకి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై, పోలీసు అధికారులను విచారణ జరిపే అధికారము ఉండుట వలన, ఈ సంస్థ వలన పోలీసుల పని తీరులో పారదర్శకత, ప్రజల పట్ల పోలీసులు భాద్యతాయుతంగా వుండటానికి దోహదపడుతుందని చెప్పారు. ఒక విధంగా ఈ సంస్థ పోలీసులపై *వాచ్ డాగ్* లాగా పని చేస్తుందని చెప్పినారు.
ఎవరైనా పోలీసు అధికారులు ఒక వ్యక్తి ప్రాణ హానికి, స్వేచ్చకు తీవ్ర విఘాతం కలిగిస్తే ఫిర్యాదు అందిన వెంటనే ఈ పోలీసు కంప్లైంటు అథారిటీ స్పందించి, వెంటనే తగు చర్య చేపట్టి ఆ వ్యక్తులను కాపాడుతుందని చెప్పారు..
కొన్ని సందర్బాలలో, బీద కుటుంబానికి చెందిన స్త్రీల పై అత్యాచారము జరిగినప్పుడు, మైనరు బాలికను కిడ్నాప్ చేసినప్పుడు కొంతమంది పోలీసు అధికారులు, డబ్బుకు, ఒత్తిళ్లకు లొంగి, చట్ట ప్రకారము నిందితులపై వెంటనే చర్య తీసుకోకపోతే, అలాంటి ఫిర్యాదు పై, తమ అథారిటీ వెంటనే చర్య తీసుకుంటుంది అని అన్నారు.సాధారణ ప్రజలు స్టేషనుకు వచ్చి,తమ వాహనం పోయిందనో, లేక ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలు పోయినవనో ఫిర్యాదు చేస్తారు. కొంతమంది పోలీసు అధికారులు కేసులు రిజిస్టరు చేసిన తరువాత, అవి నిర్ణీత సమయంలో దొరకక పోతే, పై అధికారులు తమకు ఛార్జ్ మెమోలు లు ఇస్తారని భయపడి, కేసులు ఎన్ని రోజులైనా రిజిస్టరు చేయటంలేదు. అటువంటి పరిస్థితులలో, సాధారణ ప్రజలు తమ పోలీసు కంప్లైంటు అథారిటీకి ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు చేపడుతామన్నారు. ఈ సందర్భంగా వారికి మా ప్రత్యేక అభినందనలు.
Comments are closed.