అమరావతి : కరోన కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం విద్యశాఖకు చెందిన ఉన్నత అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల ప్రారంభించాలని, ఈ నెల 12 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే నాడు నేడు పనులను త్వరితంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ వస్తుందనే విశ్లేషకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Comments are closed.