చెన్నై ప్రతినిధి: కేంద్రం తీసుకు రాబోతున్న కొత్త సినిమాటోగ్రఫీ ముసాయిదా బిల్లుపై సినీ ప్రముఖులు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ తమిళ సూపర్ స్టార్ సూర్య ట్విట్టర్ వేదికగా విమర్శించడం పై బీజేపీ నేతల ఫైర్ అవ్వడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గతంలో హీరో సిద్ధార్థ కూడా ట్విట్టర్ వేదికగా బిజెపి ఎంపీ తేజస్వి యాదవ్ పై కరోనా సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో తేజస్వి యాదవ్ కనుసన్నల్లో ప్రైవేటు దోపిడీ జరుగుతుందన్న ట్వీట్ లపై బిజెపి నేతలు కి హీరో సిద్ధార్థ కి రచ్చ జరిగిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో తమిళ హీరో సూర్య కేంద్రం కొత్తగా తీసుకు వస్తున్న సినిమాటోగ్రఫీ ముసాయిదా బిల్లుపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తపరిచారు…. సూర్య చేసిన ట్వీట్ లో… “చట్టం అంటే భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడమే కాని , దాని గొంతును కోసి చంపడం కాదు ” అంటూ ట్వీట్ చేశారు.
சட்டம் என்பது கருத்து சுதந்திரத்தை காப்பதற்காக.. அதன் குரல்வளையை நெறிப்பதற்காக அல்ல…#cinematographact2021#FreedomOfExpression
Today's the last day, go ahead and file your objections!!https://t.co/DkSripAN0d
— Suriya Sivakumar (@Suriya_offl) July 2, 2021
దీనితో తమిళ్ బిజెపి యువజన విభాగం సూర్య పై ఘాటుగా స్పందించింది. ఆయన సినిమాలు చేసుకుంటే మంచిదని, బీజేపీ పై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ చట్టంపై సూర్య నే కాక దేశంలోని చాలా మంది సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా తమ నిరసనను వ్యక్తపరిచారు.
Comments are closed.