The South9
The news is by your side.
after image

ప్రేమోన్మాదులు కి బ్రతికే అర్హత లేదు : వాసిరెడ్డి పద్మ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం జరిగిన ప్రేమోన్మాది చేతిలో అతి కిరాతకంగా హతమార్చబడ్డ తేజస్విని కుటుంబాన్ని ఆంధ్ర ప్రదేశ్ మహిళ చైర్మన్ వాసిరెడ్డి పద్మ స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ తో కలిసి పరామర్శించారు.

Post Inner vinod found

పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ
ప్రేమోన్మాదులకు సమాజంలో బతికే అర్హత లేదని రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్మన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ప్రేమించలేదనే కారణంతో తేజస్విని అనే విద్యార్థిని దారుణంగా హత్యచేసిన నిందితుడు వెంకటేష్ కి కఠిన శిక్ష విధించాలన్నారు. శుక్రవారం ఉదయం నెల్లూరు ఆర్& బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మహిళా  చైర్మన్       గూడూరులోని తేజస్విని కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్తామన్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా మహిళలపై ప్రేమోన్మాదుల దాడులు పెరిగాయని, కేవలం ప్రేమించలేదనే కారణంతో చంపే హక్కు అబ్బాయిలకు ఎవరిచ్చారన్నారు. అమ్మాయి ప్రాణం తీయడమనేది ఎంతో దారుణం అని అన్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడే వారికి భూమిపై బతికే హక్కులేదన్నారు. సమాజంలో కూడా మార్పు రావాలన్నారు. అమ్మాయిలకు మనసు ఉంటుందని, ప్రేమను తిరస్కరించే హక్కు కూడా వారికి ఉందనే విషయాన్ని అబ్బాయులు గ్రహించాలన్నారు. పట్టపగలు ఇంట్లోకి వెళ్లి అమ్మాయని కత్తితో పొడిచి చంపిన వ్యక్తికి, బతికే అవకాశం ఎందుకివ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకు కచ్చితంగా గుణపాఠం చెప్పేలా తీర్పులు ఉండాలన్నారు. దయచేసి ఇలాంటి సంఘటన పట్ల సమాజం స్పందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.

ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆర్.వరప్రసాద్, మహిళా కమీషన్ మెంబర్ టి.రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Post midle

Comments are closed.