అమరావతి. : ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన పరిషత్ ఎన్నికల వ్యవహారంలో రీ నోటిఫికేషన్ ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఆదేశాలపై ఎలక్షన్ కమిషన్ హైకోర్టును ఆశ్రయించగా… ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ .. గతంలో లో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహించామని న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్లారు. అలానే బ్యాలెట్ బాక్సులు ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వాలని అందువలన లెక్కింపు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఇప్పట్లో ఎక్కడ ఎన్నికలు జరగడం లేదు కదా అని ధర్మాసనం ఎలక్షన్ కమిషన్ తరపున న్యాయవాదిని ప్రశ్నించారు. అనంతరం జూలై 27న పూర్తిస్థాయి విచారణ చేపడతామని కేసుని వాయిదా వేయడం జరిగింది. అప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని హైకోర్టు పెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు జరగాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే!
Comments are closed.