న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాలలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికలలో తమ వ్యూహాలకు పదును పెట్టే విధంగా విపక్షాలు రాజకీయ సమావేశాలకి శ్రీకారం చుట్టాయి అనుకోవాలి . ప్రముఖ మరాఠీ నాయకుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరత్ పవర్ నివాసంలో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఈరోజు 15 పార్టీ ల తోటి సమావేశం జరగనున్నది. కేంద్రంలో బీజేపీని గద్దె దింపాలి అంటే అందరూ ఒక్క తాటిపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని దానికి అనుగుణంగా ఈ సమావేశం రూపుదిద్దుకుంటుందని సమాచారం. నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోవాలంటే మిగతా పక్షాలన్నీ ఏకతాటిపై నిలబడితే విజయం సాధించ వచ్చని దీనికి నేతృత్వం వహిస్తున్న ప్రశాంత్ కిషోర్ అన్నట్లు సమాచారం. ఇప్పటికే పలు దఫాలుగా శరత్ పవార్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రశాంత్ కిషోర్ కర్త కర్మ క్రియ అంతా తానై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి న ఘనత ప్రశాంత్ కిషోర్ కి దక్కింది . గత కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించడం జరిగింది. కాంగ్రెసేతర పక్షాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి పదహారేళ్ల తర్వాత థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే తమ ఉద్దేశం థర్డ్ ఫ్రంట్ స్థాపన కాదని చెప్పడం కొసమెరుపు. సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించి కార్యచరణ ని ప్రకటించే అవకాశంం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments are closed.