న్యూఢిల్లీ :దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. లాక్ డౌన్ విషయంలో పలు రాష్ట్రాలు సడలింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాథర్డ్ వేవ్ గురించి రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం నవంబర్ మాసంలో థర్డ్ వేవ్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరొకరి అయితే రెండు మూడు నెలల విరామం తర్వాత వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇలాంటి ప్రచారాల నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ గులేరియా మాత్రం అంత గ్యాప్ ఉండబోదని ఆరు నుంచి ఎనిమిది వారాల లోపు థర్డ్ వేవ్ ప్రభావం పొంచి ఉందని అన్నారు. అలాగే అన్ లాక్ విషయంలో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించి క్రమశిక్షణగా ఉంటే థర్డ్ వేవ్ అంత ప్రమాదం కాదని, అలా కాదని విచ్చలవిడిగా వ్యవహరిస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎయిమ్స్ చీఫ్ గులేరియా హెచ్చరించారు.
Comments are closed.