భారతదేశ అత్యున్నత పురస్కారాల లో భారతరత్న ది ప్రత్యేక స్థానం. మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత 1954లో నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ సిఫారసు మేరకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన వ్యక్తులకు కు, కులం, మతం ప్రాంతం ,అనే తేడా లేకుండా, లింగ వివక్ష చూడకుండా ఆయా రంగాల్లో చేసిన విశేష సేవలకు గుర్తించి వారికి ఇచ్చేటువంటి పురస్కారం భారత రత్న. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మన దేశంలోనే ఉన్న వారు కాక ఇద్దరు విదేశీయులతో కలుపుకొని దాదాపు 45 మంది దాకా ఈ పురస్కారాన్ని పొందిన వారు ఉన్నారు. సివి రామన్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, విదేశాల నుంచి నెల్సన్ మండేలా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఇలా ఎందరో మహానుభావులు కి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ మధ్యనే క్రీడారంగం నుంచి సచిన్ టెండూల్కర్ కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాన మంత్రి, ముఖ్య న్యాయాధీశులు కాక 7వ గౌరవం గా భారతరత్న పొందిన వారికి లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంత గొప్ప పురస్కారాన్ని గురించి ప్రముఖ హీరో హిందూపురం తెలుగుదేశం శాసనసభ్యులు బాలకృష్ణ ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…. వారి తండ్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కాలి గోటికి ఈ అవార్డు సరిపోదని వ్యాఖ్యానించారు. ఆయనకు తండ్రి మీద ప్రేమ అభిమానం ఉండొచ్చు అది ఎవరూ కాదనరు. కానీ ఒక ప్రజా ప్రతినిధి గా ఉంటూ దేశ అత్యున్నత పురస్కారం గురించి అలా మాట్లాడడం ఏ మాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. ఉద్దేశ పూర్వకముగా మాట్లాడకపోయినా ప్రజా జీవితంలో ఉన్నవారు తమ మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏది ఏమైనా ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరం, దీనిపై ఏ మేధావి వర్గం చెందిన వారు కూడా ఖండించకపోవడం కాస్త విడ్డూరంగా ఉంది.
Comments are closed.