న్యూఢిల్లీ : భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితులు వాక్సినేషన్ ల ధరలు, వ్యాక్సినేషన్ లో కొరత, వాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర వైఖరిపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర లకి, కేంద్రానికి, వేరువేరుగా ధరలు నిర్ణయించడంపై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది. ధరల విషయంలో మరొకసారి పరిశీలించాలని, అలానే ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం తన అఫిడవిట్ లో ఈ విషయంలో లో కోర్టు జోక్యం చేసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. వ్యాక్సిన్ లపై నిర్ణయాలు తమకు వదిలి వేయాలని ఇది ప్రజల ప్రయోజనార్థం, పలు సైంటిఫిక్ ఎక్స్పర్ట్ సూచన ల మేరకు తీసుకున్నామని అఫిడవిట్ లో తెలిపింది. కేంద్రం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడాన్ని అనవసరంగా అని స్పష్టం చేసింది.
Comments are closed.