The South9
The news is by your side.
after image

ఆంద్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనా

*ఏపీలో 1,398 కేసులు.. 9 మరణాలు*
*బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ*
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ బారినపడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాకుండా మృతుల సంఖ్య సైతం పెరగడం కలవరం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,260 పరీక్షలు నిర్వహించగా.. 1,398 కేసులు నిర్ధారణ కాగా.. 9 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోగా చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,234కి చేరింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,05,946 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
24 గంటల వ్యవధిలో 787 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,89,295కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,417 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,51,77,364 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరులో 273, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి.

Post midle

Comments are closed.