పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన ఆసక్తిగా మారింది. పుదుచ్చేరిలో ప్రభుత్వ మహిళా కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాహుల్ గాంధీ అక్కడ విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఒక విద్యార్థి మీ నాన్న గారిని ఎల్టిటి తీవ్రవాదులు చంపేశారు కదా అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడగగానే…. రాహుల్ మాట్లాడుతూ…. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య కు గురవడం తనకెంతో బాధ కలిగించిందని, అయితే ఆ గటనకు సంబంధించిన వారిపై తనకు ఎలాంటి కోపమూ లేదని అన్నారు. హింస ఎవరి నుంచి ఎవరిని తీసుకెళ్లలేదు. మా నాన్న ఇప్పటికీ నాతోనే ఉన్నారని నేను భావిస్తున్నాను అని తెలియజేశారు. అలానే ప్రధాని నరేంద్ర మోడీ ని ఉద్దేశిస్తూ… ఒక వ్యక్తి తాను ప్రధాని అనుకోవటం లేదని ఒక దేశానికి రాజు అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. అలానే పుదుచ్చేరిలో మత్స్యకారుల తో సమావేశమై, మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు వారితో కలిసి పడవ ప్రయాణం చేయాలని ఉందని అన్నారు. రాహుల్ గాంధీ పర్యటన పుదుచ్చేరిలో రెండు రోజులు కొనసాగనుంది.
Comments are closed.