దక్షిణ చలన చిత్ర పరిశ్రమలోనే కాక యావత్ భారతదేశంలోని గొప్ప దర్శకుడుగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు శంకర్ కి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది చెన్నైలోని ఎగ్మోర్ మెజిస్ట్రేట్ కోర్టు . శంకర్ 2010లో సూపర్ స్టార్ రజినీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన రోబో చిత్రకథ తన నవల నుంచి కాపీ చేశాడనే ఆరోపణతో తమిళ్ నందన్ అనే రచయిత కోర్టును ఆశ్రయించాడు.అరుర్ తమిళ్ నందన్ జిగుబ అనే పేరుతో ఒక పత్రికలో ఈ కథను ప్రచురించడం జరిగింది తర్వాత కాలంలో ఇదే కథను డిక్,డిక్, దీపిక అనే పేరుతో నవలగా ప్రచురించడం జరిగింది. ఈ నవల ఆధారంగా నే శంకర్ రోబో చిత్రాన్ని రూపొందించి కోట్లు గడించారని, కావున ఈ కథకు మూలమైన ఆలోచన మరియు కథ తన దైనందిన నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించాడు రచయిత అరుర్ తమిళ్ నందన్. అప్పటి నుంచి దర్శకుడు శంకర్ కోర్టుకు హాజరు కానందున నాన్ బెయిలబుల్ వారెంటె మంజూరు చేసింది ఎగ్మోర్ కోర్ట్.
Comments are closed.