The South9
The news is by your side.
after image

అధికారులా నిర్లక్ష్యమా,లేక అహంకారమా. ఆనం రామనారాయణరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లోకి నెల్లూరు జిల్లా రాజకీయాలు కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ అనేది అందరకీ తెలిసిన విషయం. ఈ నేపధ్యంలో 2019 లో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయా సమీకరణాలు పూర్తి గా మారినవి అని చెప్పవచ్చు. వైఎస్సార్సీపీ అధికారం లోకి రాగానే జిల్లా నుంచి ఇద్దరు జగన్ కి సన్నిహితులు అయినా మేకపాటి గౌతమ్ రెడ్డికి, అనీల్ కుమార్ యాదవ్ కి కీలకమైన మంత్రి పదవులు దక్కాయి. ఈ నేపధ్యంలో సీనియర్ నాయకులు అయినా ఆనం రామా నారాయణ రెడ్డి కొంత అసంతృప్తి తో ఉన్నారు అనేది అందరకీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవం రోజున అధికారులు నుంచి ఆహ్వానం లేదని ఘాటుగా విమర్శించారు. రామ నారాయణ రెడ్డి మాట్లాడుతూ..
నిన్న భారతదేశం అంతా గణతంత్ర దినోత్సవాల్లో సంతోషంగా ఉంది.
జిల్లాలో మాత్రం ఎమ్మెల్యేలకు ఆ సంతోషంగా దక్కలేదు.
రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల చోటు దక్కలేదు.

దీనికి మేము సిగ్గుపడాలో లేక ఏమి చేయాలో అర్థం కావడంలేదు.

నెల్లూరులో రిపబ్లిక్ డే పెరేడ్ జరిగితే, ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదు. కనీసం మాకు అర్హత లేదు.
40 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నాకు చాలా సిగ్గుచేటు.
అధికారుల నిర్లక్ష్యమా లేక అహంకారమా ?

ఎందుకు మమ్మల్ని పిలవలేదు అంటే, అధికారుల దగ్గర సమాచారం లేదు.

Post Inner vinod found

జిల్లా ప్రోటోకాల్ అధికారిని అడిగితే, మేము చిన్నవాళ్ళం, మీకు సమాదానం చెప్పలేము అన్నారు.

పవిత్ర మైన రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వం జరిపే ఏ కార్యక్రమాలకి ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదు.

అధికారులు మీ ఇన్విటేషన్లు ఉన్నాయి. ప్రక్కన పెట్టమన్నారని తెలిపారు.

Post midle

ఇంత నిర్లక్ష్యంలో అధికారులు జిల్లాలో ఉండడం గర్హనీయం.

దీనిపై రాష్ట్ర ప్రివిలీజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాను.
అధికారులపై రాజ్యాంగ పరంగా నన్ను రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన కుండా ఆమానించిన అధికారులపై కేసులు వేస్తాను. అని అన్నారు.

 

Post midle

Comments are closed.