వైఎస్సార్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లెలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైయస్ షర్మిల తెలంగాణాలో పార్టీ పెడుతున్నట్టు ,రకరకాల వార్తలు కొన్ని మీడియాలో కథనాలు గా రావడం ,దానికి కొంత మంది తెలుగు దేశం నాయకులు వాక్యలు చేయడం తో ఆ వార్త పై ఒక రకమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గతం గురుంచి చెప్పుకోవాల్సి వస్తే జగన్16 నెలల పాటు జైలు లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు తో పాటు పాదయాత్ర చేసి పార్టీ బలోపేతం నకు కృషి చేసింది అనే విషయం లో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత జగన్ బయటకు రావడం పాదయాత్ర చేసి పార్టీ ని అధికారం లోకి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గా పగ్గాలు చేపట్టడం తెలిసిందే . ఇక పార్టీ విషయానికి వస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కి రొండు రాష్ట్రంలో అత్యధిక అభిమానులు ఉన్నారు. ఆ రకంగా వైఎస్సార్ సీపీ కి రొండు రాష్ట్రంలో ఉన్న పార్టీ. ఇప్పుడు అక్కడ షర్మిల కి నిజంగా పార్టీ పగ్గాలు ఇవ్వాలి అనుకుంటే అది మంచి పరిణామ మే అని అంటున్నారు విశ్లేషకులు. అక్కడ కూడా షర్మిళ కు పార్టీ పగ్గాలు ఇస్తే కచ్చితంగా పార్టీ బలపడి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఈ పరిస్థితి లో కొంత మంది కావాలనే కొత్త పార్టీ అనే వార్తలు ప్రచారం చేస్తున్నారని. అసలు షర్మిల ఇప్పుడు తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టె ఆలోచన చేయవలిసిన అవసరం ఏంటి అనేది విశ్లేషకులు వాదన. అలానే వైఎస్ కుటుంబ గురుంచి తెలిసిన వారెవరూ ఈ వార్తను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఒక్కటి మాత్రం చెప్పవచ్చు వైఎస్సార్ వారసులు గా వారికి ఎప్పటికి తరగని ఆదరణ ఉంటుందని చెప్పవచ్చు.
Comments are closed.