హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. లక్షలు వసూలు చేసిన ముఠా పట్టివేత
* నకిలీ ఆర్డర్ కాఫీలతో అమాయక నిరుద్యోగులను మోసం చేసిన వైనం
* అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలువురు నిరుద్యోగులను వంచించిన ముఠా
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. లక్షలు వసూలు చేసిన ముఠాను నార్పల పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన ముగ్గుర్ని అరెస్టు చేసి వీరి నుండీ ఒక CPU, 500 GB హార్డ్ డిస్క్, DELL కంపెనీకి చెందిన మానిటర్, కీ బోర్డు మరియు మౌస్ లు,
2 సెల్ ఫోన్ లు, నకిలీ నియామక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఆర్డర్ కాఫీలతో అమాయక నిరుద్యోగులను మోసం చేస్తున్న వైనం బట్ట బయలయ్యింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలువురు నిరుద్యోగులను వంచించినట్లు విచారణలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS వివరించారు.
అరెస్టయిన నిందితులు:
1)డేరంగుల వెంకటేష్, వయస్సు 27 సం,, లు అంకిరెడ్డి పల్లి గ్రామం, కొలిమిగుండ్ల మండలం, కర్నూల్ జిల్లా,
2)తొక్కల సాయికిరణ్, వయస్సు 26 సం., నొస్సo గ్రామము, సంజామల మండలం, కర్నూల్ జిల్లా.
3)చక్కెర వెంకట సుబ్బయ్య, వయస్సు 30 సం., నొస్సo గ్రామం, సంజామల మండలం, కర్నూల్ జిల్లా.
** స్వాధీనం చేసుకున్నవి
* ఒక CPU,
* 500 GB హార్డ్ డిస్క్
* DELL కంపెనీకి చెందిన మానిటర్, కీ బోర్డు మరియు మౌస్ లు
* 2 సెల్ ఫోన్ లు
* నకిలీ నియామక పత్రాలు
నేపథ్యం:
ప్రస్తుతం అరెస్టయిన ముగ్గురిలో తొక్కల సాయి కిరణ్ కీలక నిందితుడు. ఇతను నొస్సం గ్రామంలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఇతనికి 2 సంవత్సరాల కిందట రవి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. డబ్బులు చెల్లిస్తే హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని రవి నమ్మబలికాడు. హైదరాబాద్ కు తీసికెళ్లి ఒక వ్యక్తిని చూపించి ఇతను రిటైర్డ్ DIG అని చెప్పి తొక్కల సాయికిరణ్ కు ఓ అనామకుడిని పరిచయం చేశాడు. అడ్వాన్సు కింద రూ. 30,000/- లు చెల్లించి ఉద్యోగం వచ్చాక రూ. 2,50,000/- లు కట్టేవిధంగా మాట్లాడి రవి సూచించిన నరసింహ అనే వ్యక్తి అకౌంటుకు రూ 30,000/- లు తొక్కల సాయికిరణ్ ట్రాన్సఫర్ చేశాడు. అంతేకాకుండా… తన స్నేహితుడైన బనగానపల్లికి చెందిన షేక్సావలి ద్వారా మరో నలుగురితో రూ 90,000/- లు డబ్బులు రవికి కట్టించాడు. ఎన్ని రోజులయిన సరైన సమాధానం రాకపోవడంతో రవి మోసం చేశాడని భావించి తాను కూడా ఈతరహా మోసాలకు పాల్పడితే అప్పులు నుండీ గట్టెక్కచ్చని సాయికిరణ్ అనుకున్నాడు. రెండేళ్ల కిందట బనగానిపల్లి షేక్సావలి ద్వారా మరోసారి అమాయకులైన 40 మంది నిరుద్యోగుల ద్వారా ఒక్కొక్కరి నుండి రూ 30,000/- ప్రకారం రూ 12,00,000/- లు సాయికిరణ్ కు కట్టించినాడు. ఆ డబ్బులను తన జల్సాలకు వాడుకున్నాడు. ఇదిలా ఉండగా… అనంతపురంలో ఉంటున్న తన చిన్ననాటి స్నేహితుడైన కర్నూలు జిల్లాకు చెందిన డేరంగుల వెంకటేష్ ద్వారా కూడా అనంతపురం జిల్లాలోని నార్పల ప్రాంతానికి చెందిన రవి, రఫీ, వేణుగోపాల్ ,బండి శ్రీకాంత్ మరియు CK పల్లి సాయికుమార్ రెడ్డి నుండి మొత్తం 22,67,000/- డబ్బును సాయికిరణ్ లు కట్టించుకున్నారు. డబ్బులు కట్టిన వారికి నమ్మకం కలిగే విధంగా నకిలీ డిస్టిక్ కన్పర్మేషన్ లెటర్, స్టేషన్ కన్ఫర్మేషన్ లెటర్, అపాయింట్మెంట్ ఆర్డర్ లెటర్ మరియు జాయినింగ్ రిపోర్ట్ లను సాయి కిరణ్ వాట్స్ అప్ప్ ద్వారా పంపేవాడు. అంతేకాకుండా… సాయికిరణ్ స్నేహితుడైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో లస్కర్ గా పని చేస్తున్న వెంకట సుబ్బయ్యతో నకిలీ పోలీసు అవతారమెత్తించి డబ్బు కట్టిన నిరుద్యోగులను నమ్మించాడు. సాయికిరణ్ కు ఫోటోగ్రాఫర్ గా అనుభవం ఉన్నందున నకిలీ నమూనా సంతకాలను గూగుల్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఫోటోషాప్ ద్వారా నకిలీ అపాయింట్మెంట్ , తదితర లెటర్ లను డబ్బులు కట్టిన వారికి వాట్సప్ప్ లో పంపేవారు. అనంతపురం జిల్లాకు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు ఈ మోసాలుపై నార్పల పోలీసు స్టేషన్లో కేసు Cr.No. 19/2020 u/s 420,464,465,468,471, 484 IPC సెక్షన్ల కింద నమోదు చేశారు.
అరెస్టు ఇలా… నిరుద్యోగులను వంచించిన కేసు ఛేదించాలని అనంతపురం డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి సూచించారు. ఇటుకలపల్లి సి.ఐ విజయభాస్కర్ గౌడు, నార్పల ఎస్సై ఇబ్రహీం మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. సి.ఐ కు రాబడిన సమాచారంతో ఈ ముగ్గురు నిందితులను నాయనపల్లి క్రాస్ లో అరెస్టు చేశారు.
ప్రశంస… నిరుద్యోగులను వంచించిన కేసు ఛేదించిన అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, ఇటుకలపల్లి సి.ఐ విజయభాస్కర్ గౌడు, నార్పల ఎస్సై ఇబ్రహీం, RSI రాజశేఖర్ రెడ్ది, మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS అభినందించారు.
ఉద్యోగాలిప్పిస్తామని డబ్బు దండుకునే మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోకండి
* ఉద్యోగ నియామక ప్రక్రియలు పారదర్శకంగా మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు
* ఈ తరహా మోసగాళ్ల గురించి సమాచారం ఇవ్వండి.
హోంగార్డు, తదితర ఉద్యోగాలిప్పిస్తామని డబ్బు దండుకునే మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS నిరుద్యోగ యువతీ యువకులు మరియు వారి తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలన్నీ పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారన్నారు. నిరుద్యోగులను ఉచ్చులోకి దించే మోసగాళ్ల వంచనల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అసలే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటే ఈ తరహా మోసగాళ్ల వల్ల నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో పాటు కేరీర్ న్ వృథా చేసుకున్న వారవతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మాకు ఉన్నతాధికారులు తెలుసని… ప్రజా ప్రతినిధులతో బాగా పరిచయాలున్నాయని సులువుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతూ మాయమాటలు చేప్పేవారి
గురించి జిల్లా పోలీసు వాట్సాప్ నంబర్ 9989819191 లేదా డయల్ 100 కు సమాచారం చేరవేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Comments are closed.